iPhone 16 Series : ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్.. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఈ ఆఫర్ ఉండగానే కొనేసుకోండి..!

iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది..

iPhone 16 Series

iPhone 16 Series : ఆపిల్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ భారీ తగ్గింపుతో అందుబాటులో (iPhone 16 Series) ఉంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో సహా సిరీస్‌లోని ప్రో లైనప్ కూడా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది.

ఈ రెండు ఐఫోన్లు పవర్‌ఫుల్ ఆపిల్ ప్రాసెసర్‌తో పాటు OLED డిస్‌ప్లేతో అందిస్తున్నాయి. కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ల మధ్య ఎలాంటి తేడా లేదనే చెప్పాలి. ఐఫోన్ ఔత్సాహికులు ఈ సేల్ సమయంలో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ లిమిటెడ్ ఆఫర్లు ముగియకముందే వెంటనే కొనేసుకోవడం బెటర్.. ఇంతకీ ఐఫోన్ 16 సిరీస్ కొనుగోలుపై డిస్కౌంట్లను ఎలా పొందాలంటే?

ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 మ్యాక్స్ అసలు ధర రూ.1,29,900 నుంచి రూ.1,09,900కు తగ్గింది. ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,64,900 నుంచి రూ.1,54,900కు కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.4వేలు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Read Also : Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కావాలా నాయనా.. రూ.40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఇప్పుడే కొనడం బెటర్..!

ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ ప్రో మాక్స్ వేరియంట్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ రెండు ఐఫోన్‌లు ఆపిల్ A18 ప్రాసెసర్‌తో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌ కలిగి ఉన్నాయి. ఈ ఐఫోన్లు 48MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా వైడ్-యాంగిల్ సెన్సార్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12MP కెమెరా ఉంది. ఐఫోన్ 16 ప్రోలో 3582mAh బ్యాటరీ ఉంది. ప్రో మాక్స్ వేరియంట్ 4685mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తాయి. టైటానియం వైట్, టైటానియం డెసర్ట్, టైటానియం బ్లాక్, టైటానియం వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.