Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కావాలా నాయనా.. రూ.40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. ఇప్పుడే కొనడం బెటర్..!
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ డీల్స్ ఉన్నాయి.. ఏ ఫోన్ కావాలో మీరే ఎంచుకోండి..

Amazon Prime Day Sale
Amazon Prime Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు (Amazon Prime Day Sale) అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.40వేల లోపు ధరలో అదిరిపోయే ఫోన్లు లభ్యమవుతున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్, డిజైన్‌లు, పవర్‌ఫుల్ కెమెరాలు, 5G కనెక్టివిటీని అందిస్తాయి. అల్ట్రా-ప్రీమియం ధరలపై టాప్ రేంజ్ ఫీచర్ అవసరమయ్యే యూజర్లకు బెస్ట్ ఫోన్లు అని చెప్పొచ్చు. ఈ సేల్ సమయంలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ రూ. 40వేల లోపు ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ ఓసారి లుక్కేయండి..
ఐక్యూ నియో 10 :
ఐక్యూ నియో 10 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉన్నాయి. స్పీడ్, గేమింగ్, భారీ మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్OS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఐక్యూ నియో 10 ధర రూ. 31,998కు అందిస్తోంది.
వివో V50 :
ఈ వివో ఫోన్ (Amazon Prime Day Sale) గ్లాస్ డిజైన్, పవర్‌ఫుల్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP OIS మెయిన్ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 5000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ, కంటెంట్-ఆధారిత యూజర్లకు బెస్ట్ ఫోన్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా వివో V50 ఫోన్ రూ. 34,999 ధరకు లభిస్తుంది.
వన్‌ప్లస్ 13R :
వన్‌ప్లస్ 13R ఫోన్ కొంచెం రూ. 40వేల మార్కు ఎక్కువగా ఉన్నప్పటికీ.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, ఆక్సిజన్ OS ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ వాల్యూ అందిస్తుంది. ప్రీమియం బిల్డ్, థర్మల్ డిజైన్, 5500mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13R ఫోన్ రూ. 42,997 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.