iPhone 16 Pro Max : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌ భారీగా తగ్గిందోచ్.. ఈ ఆఫర్ అసలు మిస్ చేయొద్దు!

iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ కావాలా? విజయ్ సేల్స్ ద్వారా ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 15,700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో తెలుసా?

iPhone 16 Pro Max

iPhone 16 Pro Max : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఐఫోన్ అతి తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. సాధారణంగా ఐఫోన్ కొనాలంటే లక్షలు పెట్టాలి. కానీ, కొన్నిసార్లు ఖరీదైన ఐఫోన్లు కూడా తక్కువ ధరకే లభ్యమవుతుంటాయి. మీరు ఐఫోన్ 16 ప్రో మాక్స్ కోసం చూస్తుంటే.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

Read Also : UPI GST : UPI పేమెంట్స్ చేస్తే జీఎస్టీ కట్టాలా?.. వద్దా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..

విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌తో కొనుగోలుదారులు ఆపిల్ హై-ఎండ్ ఫోన్‌పై రూ.15,700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు పాత ఐఫోన్ అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా ఆండ్రాయిడ్ నుంచి మారుతున్నా ఈ ఆఫర్ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సేవ్ అవుతుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ.1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం ఫోన్ ప్రస్తుతం రూ.1,33,700కి లిస్టు అయింది. విజయ్ సేల్స్ రూ.11,200 ధర తగ్గింపును అందిస్తోంది.

ఐఫోన్ ధర మరింత తగ్గాలంటే మీరు బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. ICICI, AXIS బ్యాంక్ లేదా KOTAK బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో EMI ఆప్షన్ ఎంచుకుంటే.. రూ. 4,500 సేవ్ చేయొచ్చు.

ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల ఎల్‌టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. 2868 x 1320 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 ప్రో చిప్, 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Realme 14T Launch : రియల్‌మి యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త రియల్‌మి 14T వచ్చేస్తోంది.. ఈ నెల 25నే లాంచ్.. ఫీచర్లు, ధర లీక్..!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్‌లో 48MP మెయిన్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4685mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.