Realme 14T Launch : రియల్‌మి యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త రియల్‌మి 14T వచ్చేస్తోంది.. ఈ నెల 25నే లాంచ్.. ఫీచర్లు, ధర లీక్..!
Realme 14T Launch : రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌మి 14T వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే ఫోన్ కీలక ఫీచర్లు, బ్యాటరీ, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Realme 14T Launch
Realme 14T Launch : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి కొత్త రియల్‌మి 14T ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది.
రియల్‌మీ 14 లాంచ్ తర్వాత టెక్ కంపెనీ రియల్‌మి 14Tని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ అందించే కొత్త T-సిరీస్ లైనప్‌లో ఇదే ఫస్ట్ మోడల్. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 25న లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
రియల్‌మి 14T భారత్ ధర (లీక్) :
నివేదిక ప్రకారం.. రియల్‌మి 14T ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.17,999, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 ఉంటుందని అంచనా. అదనంగా, రియల్‌మి రూ.1,000 లాంచ్ డిస్కౌంట్‌ను అందించవచ్చు.
డిస్‌ప్లే, డిజైన్ :
రియల్‌మి 14T ఫోన్ 2,100 నిట్ బ్రైట్‌నెస్, 111 శాతం DCI-P3 కలర్ గామట్‌తో అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ సైజు అధికారికంగా వెల్లడించనప్పటికీ, లీక్‌ల ప్రకారం.. 120Hz ప్యానెల్‌తో పాటు 6.6-అంగుళాలతో రావొచ్చు. ఈ ఫోన్ TÜV రీన్‌ల్యాండ్ వెరిఫికేషన్ కూడా పొందింది. ఎక్కువసేపు ఫోన్ వాడిన కళ్లకు ఎఫెక్ట్ ఉండదు.
బ్యాటరీ, డిజైన్ :
రియల్‌మి 14T ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ 6,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. రియల్‌మి రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందించే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 7.97mm మందంతో సన్నగా ఉంటుంది. రియల్‌మి యూజర్లు 54.3 గంటల టాక్‌టైమ్, 17.2 గంటల యూట్యూబ్, 12.5 గంటల ఇన్‌స్టాగ్రామ్, 12.5 గంటల గేమింగ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read Also : Shubhanshu Shukla : 40 ఏళ్ల నిరీక్షణ.. మేలో అంతరిక్ష యాత్రకు తొలి భారత వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?
రియల్‌మి ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ : ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది.
కెమెరా : 50MP మెయిన్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. సెకండరీ సెన్సార్ వివరాలు రివీల్ చేయలేదు.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ : ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 SoC పవర్, ఆండ్రాయిడ్ 15 ఉండొచ్చు.
ర్యామ్, స్టోరేజీ : 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజీ ఆప్షన్లు ఉండొచ్చు.