Shubhanshu Shukla : 40 ఏళ్ల నిరీక్షణ.. మేలో అంతరిక్ష యాత్రకు తొలి భారత వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?
Shubhanshu Shukla : 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ వచ్చే నెలలో కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపనుంది. ISS సందర్శించనున్న మొదటి భారతీయ వ్యోమగామిగా ఈ మిషన్ మొదలు కానుంది.

Shubhanshu Shukla
Shubhanshu Shukla : 40 ఏళ్ల నిరీక్షణ ఫలించబోతోంది. అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక విజయాలు సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. 4 దశాబ్దాల తర్వాత అంతరిక్ష ప్రయాణంలో భారత్ మరో హిస్టరీకి రెడీ అవుతోంది. వచ్చే (మే) నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ వ్యోమగామిని పంపనున్నారు.
ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్తు ప్రణాళికల కోసం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. ఈ మిషన్‌లో భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను పంపుతున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించనున్న తొలి భారతీయుడు రాకేష్ శర్మ అని జితేంద్ర సింగ్ అన్నారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌకలో ప్రయాణించిన 4 దశాబ్దాల తర్వాత అంతరిక్షంలోకి మొదటి భారతీయ వ్యోమగామి వెళ్లనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ రాబోయే వివిధ అంతరిక్ష కార్యకలాపాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆక్సియమ్ స్పేస్ X-4 మిషన్ (Axiom-4 mission)లో భాగంగా గ్రూప్ కెప్టెన్ శుక్లా వచ్చే నెలలో ISSకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రైవేట్ మిషన్ కోసం బడ్జెట్‌ను 1.1 బిలియన్ డాలర్ల ప్రారంభ వ్యయం నుంచి 2.32 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసినట్టు చెప్పారు.
ISSలో శుక్లా అనుభవాలు ఇస్రోకు సాయపడతాయి. ఈ అంతరిక్ష నౌకను ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ ప్రైవేట్ మిషన్‌కు నాయకత్వం వహిస్తుండగా, 39 ఏళ్ల శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తారు. ఆయన దాదాపు రెండు వారాల పాటు ఉంటారని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆయన పరిశోధనతో పాటు అనేక ప్రయోగాలు చేయనున్నారు.
కెప్టెన్ శుభాన్షు శుక్లా ఎవరంటే? :
గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా శిక్షణ పొందిన వైమానిక దళ పైలట్. ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ (HSP) కింద ఎంపికయ్యాడు. భారత మొట్టమొదటి స్వదేశీ సిబ్బందితో కూడిన గగన్‌యాన్ మిషన్‌కు అగ్ర పోటీదారులలో ఒకరు.
2006లో ఆయన భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్‌గా చేరారు. సుఖోయ్-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 వంటి విమానాలను 2వేల గంటలకు పైగా నడిపిన అనుభవం ఆయనకు ఉంది. 1999 కార్గిల్ యుద్ధం ప్రేరణతో శుక్లా సైన్యంలో చేరారు.
భారత వైమానిక దళం (IAF) పైలట్ అయిన శుక్లా.. మిషన్ కమాండర్‌గా పనిచేసే మాజీ నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వంలోని సిబ్బందిలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మిషన్ నిపుణులు పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు కూడా ఉంటారు. ఈ మిషన్ మొదటి ఇస్రో వ్యోమగామిని ఐఎస్ఎస్‌కి పంపడమే కాకుండా, పోలాండ్, హంగేరీ నుంచి వ్యోమగాములు స్టేషన్‌లో మొదటిసారి బస చేయనున్నారు.
Read Also : UPI GST : UPI పేమెంట్స్ చేస్తే జీఎస్టీ కట్టాలా?.. వద్దా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..
జూన్ 2006లో IAF ఫైటర్ వింగ్‌లో చేరడంతో శుక్లా ప్రయాణం ప్రారంభమైంది. మార్చి 2024లో గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఆయన ఎదిగారు. 2019లో శుక్లాకు ఇస్రో నుంచి పిలుపు వచ్చింది. రష్యాలోని మాస్కోలోని స్టార్ సిటీలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో కఠినమైన శిక్షణను పొందారు.
ఫిబ్రవరి 27, 2024న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025లో ప్రయోగించనున్న భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎలైట్ వ్యోమగాములలో ఒకరిగా శుక్లాను ప్రకటించారు. ఆగస్టు 2024లో ఐఎస్ఎస్ ఇండో-యుఎస్ మిషన్‌కు ‘ప్రధాన’ వ్యోమగామిగా శుక్లా ఎంపికయ్యారు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ‘బ్యాకప్’ వ్యోమగామిగా ఎంపికయ్యారు.