Oppo A5 Pro 5G : వారెవ్వా.. ఒప్పో కొత్త 5G ఫోన్ కిర్రాక్.. ఫీచర్లు మాత్రం హైలెట్ అంతే.. ఈ నెల 24నే లాంచ్.. గెట్ రెడీ!
Oppo A5 Pro 5G : ఒప్పో A5 ప్రో 5G భారత్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. 5,800mAh బ్యాటరీతో IP69 రేటింగ్ కలిగిన ఈ 5జీ ఫోన్ చిన్న బ్యాటరీతో రానుంది.

Oppo A5 Pro 5G
Oppo A5 Pro 5G : ఒప్పో లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి సరికొత్త A5 Pro 5G ఫోన్ వచ్చేస్తోంది. భారత్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అంతేకాదు.. రాబోయే 5G ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ వివరాలను కూడా ఒప్పో వెల్లడించింది.
ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ69-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఒప్పో A5 ప్రో 5G గత ఏడాది చివరిలో చైనాలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
చైనీస్ టెక్ కంపెనీ ఒప్పో A5 ప్రో 5G ఏప్రిల్ 24న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. IP69 రేటింగ్, డ్రాప్ రెసిస్టెన్స్ కోసం డ్యామేజ్-ప్రూఫ్ 360-డిగ్రీల ఆర్మర్ బాడీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 200 శాతం నెట్‌వర్క్ బూస్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఒప్పో A5 ప్రో 5G 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది. నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ ఇండియన్ వేరియంట్ చైనీస్ వేరియంట్ కన్నా చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. చైనా మోడల్ 6,000mAh బ్యాటరీతో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది.
ఒప్పో A5 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
ఒప్పో A5 ప్రో 5G చైనీస్ వేరియంట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoCని కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
Read Also : Tech Tips : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జ్ ఫాస్ట్‌గా దిగిపోతుందా? ఈ 7 ఈజీ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!
సెల్ఫీల విషయానికి వస్తే.. 16MP సెన్సార్‌ను కలిగి ఉంది. యూకేతో సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో విక్రయించే ఒప్పో A5 ప్రో 5G వేరియంట్ 5,800mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్షిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఒప్పో A5 ప్రో 5G గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర CNY 1,999 (దాదాపు రూ. 23,300) ప్రారంభ ధరతో లాంచ్ అయింది.