Realme GT 7 Launch : ఖతర్నాక్ ఫీచర్లతో రియల్‌మి GT 7 వచ్చేస్తోంది.. ఈ నెల 23నే లాంచ్.. ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్.. ఓసారి లుక్కేయండి!
Realme GT 7 Launch : కొత్త రియల్‌మి ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి GT 7 లాంచ్ కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme GT 7 Launch
Realme GT 7 Launch : రియల్‌మి అభిమానులకు గుడ్ న్యూస్.. రియల్‌మి నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్‌మి GT 7 ఫోన్ ఏప్రిల్ 23న చైనాలో ఆవిష్కరించనుంది. గత ఏడాదిలోరియల్‌మి GT 6 జూలైలో లాంచ్ అయింది. కంపెనీ మొదటగా చైనాలో ఈ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది.
ఆ తర్వాత త్వరలోనే భారతీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. రియల్‌మి GT 7 ప్రపంచవ్యాప్తంగా లేదా భారత్‌లో లాంచ్ గురించి రియల్‌మి ఎలాంటి కచ్చితమైన వివరాలను రివీల్ చేయలేదు. భారతీయ మార్కెట్లోకి ఈ ఫోన్ అతి త్వరలో లాంచ్ కావొచ్చు.
అధికారిక లాంచ్‌కు ముందే రియల్‌మి GT 7 ఫోన్ ఫీచర్లు, ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ కలిగిన మొదటి ఫోన్లలో ఒకటిగా చెప్పవచ్చు. మాలి-G720 ఇమ్మెర్టాయిల్స్ MC12 GPUతో వస్తుంది. రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ 6 స్కోర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
రియల్‌మి GT 7 సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 2,078, మల్టీ-కోర్ టెస్టులో 7,037 స్కోర్‌లను సాధించింది. రియల్‌మి GT 7 ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు రియల్‌మి కొత్త ఫోన్‌లో బ్లాక్, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. NFC, INT సపోర్ట్ వంటి ఫీచర్లను కూడా ఉంటాయని భావిస్తున్నారు.
డిస్‌ప్లే, డిజైన్ వివరాలు (అంచనా) :
డిస్‌ప్లే, డిజైన్ విషయానికి వస్తే.. రియల్‌మి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఈ ఫోన్ 1Hz నుంచి 120Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K LTPO ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్లూయిడ్ యానిమేషన్స్, బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
బయోమెట్రిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి GT 7లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. 99శాతం రేటుతో కేవలం 0.1 సెకన్లలో ఫోన్ అన్‌లాక్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఇతర ముఖ్యమైన మార్పుల్లో IP69-రేటెడ్ వాటర్, డస్ట్ నిరోధకత, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, NFC, రిమోట్ కంట్రోల్ ఫంక్షన్ల కోసం IR బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ద్వారా గేమ్-సెంట్రిక్ వైబ్రేషన్ సిస్టమ్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయి.
ఇమేజింగ్ పరంగా రియల్‌మి GT 7 గత డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయిన రియల్‌మి నియో 7 మాదిరిగానే సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. బ్యాక్ సైడ్ 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను చూడవచ్చు. అదనంగా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు 7,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.