Tech Tips : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జ్ ఫాస్ట్‌గా దిగిపోతుందా? ఈ 7 ఈజీ టిప్స్ ఓసారి ట్రై చేయండి..!
Tech Tips : మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుందా? ఈ సింపుల్ టిప్స్ ద్వారా బ్యాటరీ సమస్యలను అధిగమించవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఈ టిప్ప్ పాటించడమే..

Smartphone battery draining
Tech Tips : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వెంటనే అయిపోతుందా? వేసవిలో కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగానికి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ తప్పనిసరి. ఫోటోలు తీయడం, మ్యాప్‌లను వాడటం, ఫోన్ కాల్ చేయడం లేదా క్యాబ్ బుక్ చేసుకోవడం వంటివి ఉంటాయి.
ముఖ్యంగా బయటకు వెళ్లిన సమయంలో బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే దిగిపోవడం సమస్య ఎక్కువగా ఉంటుందా? మీ హ్యాండ్‌సెట్ బ్యాటరీని ఫాస్ట్‌గా ఖాళీ చేసే కొన్నింటిని వెంటనే ఆపేయాలి. లేదంటే ఫోన్ బ్యాటరీ కొన్నాళ్లకు పూర్తిగా పాడైపోతుంది. మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ కోసం కొన్ని స్మార్ట్ టిప్స్ ఓసారి ట్రై చేయండి.
1. పవర్ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయండి :
మీ దగ్గర ఛార్జర్ లేనప్పుడు పవర్ సేవింగ్ మోడ్‌ను ఎనేబుల్ చేయండి. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ యాప్‌లను పరిమితం చేస్తుంది. రిఫ్రెష్ రేటును తగ్గిస్తుంది. ఇది ఆన్ చేసేందుకు Settings > Battery ఆప్షన్‌కు వెళ్లండి లేదా క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ నుంచి షార్ట్‌కట్ ఉపయోగించండి.
2. స్మార్ట్ పవర్ కోసం అడాప్టివ్ బ్యాటరీని వాడండి :
మీరు యాప్‌లను ఎలా వాడుతారో మీ ఫోన్ అడాప్టివ్ బ్యాటరీని ఎనేబుల్ చేయండి. తరచుగా వాడే యాప్‌లకు ఎక్కువ పవర్ అందిస్తుంది. ఇతర వాడని యాప్స్ పరిమితం చేస్తుంది. ఇందుకోసం
Settings > Battery > Adaptive Battery. శాంసంగ్ ఫోన్లలో Battery > Power saving > Adaptive power saving కింద ఆప్షన్ ఎంచుకోండి.
3. డార్క్ మోడ్‌కి మారండి.. స్క్రీన్ టైమ్‌అవుట్‌ను తగ్గించండి :
మీ ఫోన్‌లో OLED లేదా AMOLED స్క్రీన్ ఉంటే.. డార్క్ మోడ్‌ను ON చేస్తే బ్యాటరీ ఆదా అవుతుంది.
స్క్రీన్ టైమ్‌అవుట్‌ను 15 లేదా 30 సెకన్లకు తగ్గించండి. వాడకపోయినా స్క్రీన్ వేగంగా స్టాప్ చేస్తుంది.
Settings > Display > Dark Mode and Display > Screen Timeout.
4. బ్యాటరీని ఖాళీ చేసే యాప్స్ డిసేబుల్ చేయండి :
Settings > Battery Usage ద్వారా ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని వాడేస్తున్నాయో చెక్ చేయండి.
ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఫోన్లలో వాడని యాప్‌లను ఆపేయండి లేదా బ్యాక్‌గ్రౌండ్ రన్ కాకుండా ఆఫ్ చేయండి.
5. “Hey Google” వాయిస్ డిటెక్షన్‌ను టర్న్ ఆఫ్ చేయండి :
హ్యాండ్స్-ఫ్రీ హెల్ఫ్ మంచిదే.. అదేపనిగా వాడితే మీ బ్యాటరీని వెంటనే ఖాళీ చేస్తుంది.
Settings > Google Assistant > Hey Google & Voice Matchకి వెళ్లి స్విచ్ ఆఫ్ చేయండి.
6. Always On డిస్‌ప్లేను డిసేబుల్ చేయండి :
ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు బాగున్నాయి. కానీ, ఫోన్ అధిక పవర్ వినియోగిస్తాయి.
Settings > Lock Screen > Always On Display నుంచి టర్న్ ఆఫ్ చేయండి.
7. లొకేషన్ సెట్టింగ్‌లను సెట్ చేయండి :
గూగుల్ మ్యాప్స్ వంటి యాప్‌లకు మాత్రమే లొకేషన్ యాక్సెస్‌ను అనుమతించండి.
గేమ్‌లు, సోషల్ మీడియా లేదా షాపింగ్ యాప్స్ కోసం ఆఫ్ చేయండి.
కంట్రోల్ యాక్సెస్ కోసం Settings > Location > App Permissions ఆప్షన్ ఎంచుకోండి.