ITR 2026 Deadlines : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్: ITR ఫైలింగ్ ఇప్పుడే చేయొచ్చా? అసలు డెడ్‌లైన్ ఏంటి? పూర్తి వివరాలు ఇవే!

ITR 2026 Deadlines : పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుతానికి ఐటీఆర్ ఫైలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను ఎప్పుడు దాఖలు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ITR 2026 Deadlines

  • ఐటీఆర్ ఫైలింగ్ 2026 డెడ్ లైన్ డేట్స్ తెలుసా?
  • పన్నుచెల్లింపుదారులు ఐటీఆర్ ఎప్పుడు ఫైలింగ్ చేయాలి?
  • ఐటీఆర్ ఎవరు ఫైలింగ్ చేయాలి? ప్రాసెస్, పెనాల్టీలేంటి?

ITR 2026 Deadlines: టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఐటీఆర్ చెల్లించేందుకు రెడీగా ఉండండి.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసింది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్) దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఫైలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అవసరమైన ఫారమ్‌లు, ఆన్‌లైన్ వ్యవస్థలను మే 2026లో ప్రారంభించనుంది. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ అప్పటినుంచే ఫైలింగ్ చేయొచ్చు.

ఐటీఆర్ ఫైలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? :
చార్టర్డ్ అకౌంటెంట్ ప్రకారం.. పోర్టల్‌లో సంబంధిత ఫారమ్‌లు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైల్ చేయగలరు. ఈ ఫీచర్ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెలలో ప్రారంభమవుతుంది. మీ కేటగిరీకి సంబంధించిన ఫారం యాక్టివేట్ అయ్యే వరకు రిటర్న్‌లను ఫైల్ చేయలేరు.

ముందుగా ఈ డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి :
ఫైలింగ్ చేసే ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను రెడీ చేసుకోండి. ఇందులో ఫారం 16, టీడీఎస్ సర్టిఫికెట్లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, వడ్డీ స్టేట్‌మెంట్లు, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్లు, పెట్టుబడి ప్రూఫ్ ఉంటాయి. మీ రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు పొరపాట్లకు అవకాశం తగ్గుతుంది.

Read Also : PM Kisan Alert : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 23వ విడత వచ్చేస్తోంది.. అర్జెంట్‌గా ఈ 3 పనులు చేయండి.. లేదంటే రూ. 2వేలు పడవు..!

ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీలు (AY 2026-27)

  • ఆడిట్ అవసరం లేని వారు : జూలై 31, 2026
  • వ్యాపార/వృత్తి రంగంలో ఉన్నవారు (ఆడిట్ లేకుండా) : ఆగస్టు 31, 2026
  • పన్ను ఆడిట్‌కు లోబడి ఉన్నవారు : అక్టోబర్ 31, 2026
  • ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కేసు : నవంబర్ 30, 2026

ఐటీఆర్ ఎవరు దాఖలు చేయాలి? :
మీ ఆదాయం ఆదాయపు పన్ను పరిమితిని మించి ఉంటే.. ఐటీఆర్ దాఖలు తప్పనిసరి. ఈ పరిమితి పాత పన్ను విధానం ప్రకారం రూ. 2.5 లక్షలు, కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 4 లక్షలుగా ఉంది. భారీ లావాదేవీలు, విదేశీ ఆస్తులు, అధిక విద్యుత్ బిల్లులు లేదా అధిక టీడీఎస్ కోతలు వంటి కొన్ని సందర్భాలలో కూడా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి.

తక్కువ ఆదాయం ఉన్నా ఐటీఆర్ ఎందుకు? :
మీ ఆదాయం పన్ను పరిమితి కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, ఐటీఆర్ (ITR) ఫైల్ చేయాలి. మీ ఆదాయానికి సంబంధించిన అధికారిక రికార్డును అందిస్తుంది. లోన్ పొందడం, వీసా కోసం అప్లయ్ చేయడం లేదా మరే ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది.

అంతేకాదు.. మీపై అధిక టీడీఎస్ (TDS) కోతలు ఉంటే రీఫండ్ కోసం ఐటీఆర్ (ITR) ఫైల్ చేయడం తప్పనిసరి. ఇంకా, మీరు స్టాక్ మార్కెట్ నష్టాల వంటి నష్టాలను రాబోయే సంవత్సరాలకు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఐటీఆర్ గడువు దాటితే ఏమవుతుంది? :
మీ ఐటీఆర్ సమయానికి దాఖలు చేయకపోతే సెక్షన్ 234F కింద ఆలస్య రుసుములు చెల్లించవలసి రావచ్చు. పన్నుపై వడ్డీ కూడా పడుతుంది. రీఫండ్ కూడా ఆలస్యం కావచ్చు.