ITR Filing Last Date : జీతగాళ్లకు బిగ్ అలర్ట్.. ITR ఎప్పుడు ఫైల్ చేయాలో తెలుసా? ఈ TAX డెడ్‌లైన్స్ రాసి పెట్టుకోండి.. కంప్లీట్ గైడ్

ITR Filing Last Date : కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైంది. జీతం తీసుకునే చాలా మంది ఉద్యోగులు ముఖ్యమైన ఆదాయపు పన్ను దాఖలు గడువు తేదీలను తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏయే తేదీల్లో ఎప్పుడంటే?

ITR Filing Last Date ( Image Credit : Gemini AI )

  • ఐటీఆర్ దాఖలుకు సంబంధించి కీలక అప్‌డేట్స్
  • ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపునకు చివరి తేదీలివే
  • ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేయాల్సిన ముఖ్యమైన పనులివే

ITR Filing Last Date : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ముఖ్యంగా ప్రతినెలా శాలరీ తీసుకునే ఉద్యోగులు రెడీగా ఉండండి.. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైంది. జీతం తీసుకునే చాలా మంది ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలుకు గడువు తేదీని తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే, ఐటీఆర్ దాఖలుతో పాటు ఇంకా అనేక ముఖ్యమైన గడువులు ఉన్నాయని మరచిపోతుంటారు.

రిటర్న్ దాఖలుతో పాటు, అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్‌లకు కూడా అనేక గడువులు ఉన్నాయి. ఈ నిబంధనలను పాటించకపోతే భారీ మొత్తంలో పెనాల్టీలను చెల్లించాల్సి రావొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు తేదీల వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఏప్రిల్ నుంచి జూన్ వరకు ముఖ్యమైన పనులివే :
ఏప్రిల్ నెలలో టీడీఎస్ సర్టిఫికెట్ జారీ, ఫారం 15G/15H దాఖలు చేయాలి. మార్చి నెల టీడీఎస్ లేదా టీసీఎస్ దాఖలు చేయాలి. మే నెలలో ఏప్రిల్ నెల టీడీఎస్ డిపాజిట్, వార్షిక ఆర్థిక లావాదేవీల రిపోర్టు సమర్పించాలి. జూన్ నెలలో మొదటి ముందస్తు పన్ను వాయిదా చెల్లించాలి. జూన్ 15వ తేదీలోగా చెల్లించడం అత్యంత కీలకం.

ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ :
FY27కి సంబంధించి జూలై 31వ తేదీ అత్యంత ముఖ్యమైన తేదీలలో ఒకటి. జీతభత్యాలు పొందే, ఆడిట్ పరిధిలోకి రాని పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోగా తమ ఐటీఆర్ దాఖలు చేయాలి. మిగిలి ఉన్న ఏవైనా పన్ను బకాయిలను ఈ సమయానికి డిపాజిట్ చేయాలి.

Read Also : Split vs Window AC : బాబోయ్ ఎండలు.. కొత్త AC కొంటున్నారా? స్ప్లిట్ ఏసీనా? విండో ఏసీనా? ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్

అడ్వాన్స్ పన్ను రెండో వాయిదా అంటే మొత్తంలో 45 శాతాన్ని సెప్టెంబర్ 15వ తేదీలోగా జమ చేయాలి. ఆడిట్ చేసిన కేసులలో అక్టోబర్ 31వ తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్టులను నవంబర్ 30వ తేదీలోగా సమర్పించాలి.

డిసెంబర్‌లో కూడా రెండు ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. 75శాతం వరకు ఉండే థర్డ్ అడ్వాన్స్ పన్ను వాయిదా చెల్లించడానికి డిసెంబర్ 15వ తేదీ చివరి తేదీ. ఆలస్యంగా లేదా సవరించిన ఐటీఆర్ దాఖలుకు డిసెంబర్ 31వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు.

జనవరి నుంచి మార్చి వరకు :
ఈ సంవత్సరం చివరి నెలల్లో మీ పన్ను ఆదా పెట్టుబడులను ప్లానింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. పాత పన్ను విధానం ప్రకారం.. వంద శాతం ముందస్తు పన్నును మార్చి 15వ తేదీలోగా చెల్లించాలి. పన్ను ఆదా పెట్టుబడులను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలి.

ఈ తేదీలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పెనాల్టీలను నివారించడమే కాదు మీ పన్నులను కూడా మెరుగ్గా చెల్లించవచ్చు. ముందుగా ప్లానింగ్ చేసుకుంటే మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.