January 2026 Bike Launch (Image Credit to Original Source)
January 2026 Bike Launch : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రస్తుతం జనవరిలో సరికొత్త బైకులు రాబోతున్నాయి. ఆటో దిగ్గజాలైన మహీంద్రా, టాటా, స్కోడా, రెనాల్ట్ వంటి కంపెనీల నుంచి కొత్త కార్లు రిలీజ్ కానున్నాయి. కేటీఎం, బీఎండబ్ల్యూ, బ్రిక్స్టన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీల నుంచి కొత్త బైకులు కూడా వస్తున్నాయి. పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేటీఎం 390 అడ్వెంచర్ ఆర్ :
భారత మార్కెట్లో కేటీఎం కొత్త 390 అడ్వెంచర్ ఆర్ లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. స్టాండర్డ్ 390 అడ్వెంచర్ కన్నా అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ఇందులో లాంగ్ ట్రావెల్ అడ్జస్టబుల్ డబ్ల్యూపీ అపెక్స్ సస్పెన్షన్, 272mm గ్రౌండ్ క్లియరెన్స్, 870mm సీటు ఎత్తుగా ఉన్నాయి.
398.7cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండొచ్చు. 44bhp 39 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల బ్యాక్ టైర్లతో వస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 :
ఈ ఏడాది భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేక కొత్త బైక్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉంది. అయితే, జనవరి నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నెలలో అనేక కొత్త ఫీచర్లను అందించనుంది.
ఈ భారతీయ కంపెనీ జనవరి 2026లో బుల్లెట్ 650 ట్విన్ (రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650)ను లాంచ్ చేయడం ద్వారా 650సీసీ లైనప్‌ను అందించనుంది. 648సీసీ ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. 47bhp పవర్, 52 న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Read Also : 5 Best Phones 2026 : కొత్త ఏడాదిలో కొత్త ఫోన్లు.. రూ. 10వేల లోపు ధరలో 5 బెస్ట్ ఫోన్లు.. ఏది కొంటారో మీఇష్టం
బీఎండబ్ల్యూ, టీవీఎస్ భాగస్వామ్యంతో ఈ ఏడాది కొత్త బైకు రిలీజ్ చేయనున్నాయి. జాయింట్ వెంచర్‌లో బీఎండబ్ల్యూ బ్రాండ్ కొత్త అడ్వెంచర్ బైక్ బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ ఈ నెలలో లాంచ్ కానుంది.
January 2026 Bike Launch (Image Credit to Original Source)
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కేటీఎం వంటి కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గిస్తుంది. 450సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. 48bhp పవర్ 43 న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్‌లో స్లిప్పర్ క్లచ్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, టీఎఫ్టీ డిస్‌ప్లే, కార్నరింగ్ ఏబీఎస్ మల్టీ రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి.
బ్రిక్స్టన్ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ బైక్ క్రాస్ ఫైర్ 500 స్టోర్ ఈ నెలలో భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. 486cc, ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. 47.6 హార్స్‌పవర్ 43Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ 5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, ఇతర ఫీచర్లతో పాటు USB ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ర్యాలీ టైర్ కూడా ఉంది.
కేటీఎమ్ ఆర్‌సీ 160 :
ఈ నెలలో భారత మార్కెట్లో కేటీఎమ్ మరో బైక్‌ను లాంచ్ చేయనుంది. ఆర్‌సీ 160 డ్యూక్ 160 ఫుల్ ఫెయిర్డ్ వెర్షన్. కేటీఎం 160 డ్యూక్ మాదిరిగానే మెకానికల్ స్పెసిఫికేషన్లను అందిస్తుంది.
అలాగే ఇతర ఫీచర్లతో స్పెషల్ బైక్‌గా నిలువనుంది.