Maruti Suzuki Victoris : కొంటే ఇలాంటి కారు కొనాలి.. రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో మారుతి సుజుకి విక్టోరిస్.. నెలకు ఈఎంఐ ఎంతంటే?
Maruti Suzuki Victoris : మారుతి కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? కొత్త మిడ్-సైజ్ SUV విక్టోరిస్ కారును రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో కొనేసుకోవచ్చు. ఇంతకీ నెలకు ఈఎంఐ ఎంత కట్టాలి? పూర్తి వివరాలను తెలుసుకుందాం..
Maruti Suzuki Victoris (Image Credit to Original Source)
- మారుతి సుజుకి విక్టోరిస్ కారు ధర ఎంతంటే
- రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర నుంచి ప్రారంభం
- టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 23.23 లక్షల (ఎక్స్-షోరూమ్)
- రూ. 1.16 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 52వేలు ఇన్సూరెన్స్ ఫీజు
Maruti Suzuki Victoris : మారుతి కార్ల లవర్స్‌కు బిగ్ న్యూస్.. మారుతి సుజుకి విక్టర్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో అనేక మోడల్ కార్లను అందిస్తుంది.
ఈ మోడల్ కార్లు మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి. మీరు కూడా మారుతి విక్టర్ కారు కొనేందుకు చూస్తుంటే ఇది మీకోసమే.. కొన్ని నెలల క్రితమే కంపెనీ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ మారుతి సుజుకి విక్టోరిస్‌ను లాంచ్ చేసింది. మీరు ఈ SUV మోడల్ కారును ఈఎంఐలో అతి చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంతంటే? :
మారుతి సుజుకి విక్టోరిస్ ధర విషయానికి వస్తే.. రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 23.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Read Also : Oppo Find X8 Pro : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే..
మీరు ఢిల్లీలో బేస్ వేరియంట్ కొనుగోలు చేస్తే.. మీరు రూ. 1.16 లక్షలు (రిజిస్ట్రేషన్ ఫీజు), సుమారు రూ. 52వేలు ఇన్సూరెన్స్ ఫీజు చెల్లించాలి. ఇతర ఛార్జీలతో సహా మారుతి సుజుకి విక్టోరిస్ రూ. 12.30 లక్షలు (ఆన్-రోడ్)తో ఇంటికి తెచ్చుకోవచ్చు.
మారుతి సుజుకి విక్టోరిస్ డౌన్ పేమెంట్ :
మారుతి సుజుకి విక్టోరిస్ బేస్ వేరియంట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే మీరు దాదాపు రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత మీరు బ్యాంకు నుంచి రూ. 9.30 లక్షలు ఫైనాన్స్ చేసుకోవాలి.
నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మీరు మారుతి సుజుకి విక్టర్ బేస్ వేరియంట్‌ను రూ. 3 లక్షల డౌన్ పేమెంట్‌తో లభిస్తోంది. 9 శాతం వడ్డీ రేటుతో 7 ఏళ్లకు రూ. 9.30 లక్షల బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. మీరు నెలకు రూ. 14,963 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం 7 ఏళ్లలో నెలకు రూ. 14,963 ఈఎంఐ చెల్లిస్తారు. రూ. 3.26 లక్షల వడ్డీతో సహా మొత్తం రూ. 12.56 లక్షలు బ్యాంకుకు తిరిగి చెల్లిస్తారు.
