5 Best Phones 2026 : కొత్త ఏడాదిలో కొత్త ఫోన్లు.. రూ. 10వేల లోపు ధరలో 5 బెస్ట్ ఫోన్లు.. ఏది కొంటారో మీఇష్టం
5 Best Phones 2026 : రూ. 10వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఫోన్ ఉందేమో చూసుకోండి.
Best SmartPhones January 2026 (Image Credit to Original Source)
- 2026 జనవరిలో 5 ఆకర్షణీయమైన ఫోన్లు మీకోసం
- రూ. 10వేల లోపు ధరలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేసుకోవచ్చు
- శాంసంగ్ గెలాక్సీ M06, మోటోరోలా G06 పవర్, లావా బోల్డ్ N1 5G, పోకో M7, రెడ్‌మి 14C
- 50MP+ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా, సెల్ఫీ కెమెరా, 8MP కెమెరా ఫీచర్లు హైలెట్
5 Best Phones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. 2026 జనవరిలో సరసమైన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ. 10వేల లోపు ధరలో 5 అద్భుతమైన ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఫోన్ స్క్రీన్ క్వాలిటీ, ప్రాసెసింగ్ కెపాసిటీ, కెమెరా సెటప్, బ్యాటరీ బ్యాకప్‌తో లభిస్తున్నాయి.
ఈ లిస్టులో శాంసంగ్ గెలాక్సీ M06, మోటోరోలా G06 పవర్, లావా బోల్డ్ N1 5G, పోకో M7, రెడ్‌మి 14C ఉన్నాయి. ఈ మోడళ్లు అదిరిపోయే డిస్‌ప్లేలు, కెమెరాలు, ఫీచర్లను అందిస్తుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో అద్భుతమైన ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఇప్పుడే ఇందులో ఏ ఫోన్ కావాలో సెలెక్ట్ చేసుకుని కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ M06 (రూ. 9,999) :
శాంసంగ్ గెలాక్సీ M06 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్, బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల పీఎల్ఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 25W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. ఫొటోల విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా, సెల్ఫీ ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఫీచర్ కూడా ఉంది.
మోటోరోలా G06 పవర్ (రూ. 7,999) :
ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 18W ఛార్జింగ్ సపోర్ట్, భారీ 7000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రన్ అవుతుంది. 6.88-అంగుళాల ఐపీఎస్‌ఎల్ సీడీ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ అందిస్తుంది. కెమెరా సెటప్‌లో 8MPసెల్ఫీ లెన్స్‌తో పాటు సింగిల్ 50MP రియర్ సెన్సార్ ఉంటుంది.
లావా బోల్డ్ N1 (రూ. 6,899) :
లావా బోల్డ్ N1 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ అందించే 6.75-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. యూనిసోక్ T765 చిప్‌సెట్‌తో 10W ఛార్జింగ్ కెపాసిటీతో 5000mAh పవర్ సెల్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్-ఫేసింగ్ యూనిట్‌ను అందిస్తుంది.

Best SmartPhones January 2026 (Image Credit to Original Source)
పోకో M7 (రూ. 9,599) :
కెమెరా విషయానికొస్తే.. పోకో M7 బ్యాక్ సైడ్ 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ సెటప్, 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. పోకో M7 120Hz రిఫ్రెష్ రేట్ 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. 45W ఛార్జింగ్ స్పీడ్‌తో 5110mAh బ్యాటరీని అందిస్తుంది.
రెడ్‌మి 14C (రూ. 9,999):
రెడ్‌మి 14C ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇచ్చే 6.88-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా కాన్ఫిగరేషన్, 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 18W ఛార్జింగ్‌తో 5160mAh బ్యాటరీ ఉంది.
