Jio IPO SEBI : జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.37,700 కోట్ల మెగా ఇష్యూకు లైన్ క్లియర్!
Jio IPO SEBI : జియో ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ.37,700 కోట్ల ఐపీఓకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. షేర్ల వివరాలు, నిధుల వినియోగం, జియో వినియోగదారుల సంఖ్యకు సంబంధించి పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- August 28, 2026 / 09:39 PM IST
Jio IPO SEBI
- జియో ప్లాట్‌ఫామ్స్‌కు భారీ ఊరట..
- రూ.37,700 కోట్ల మెగా ఇష్యూకు సెబీ అనుమతి
- భారత IPO మార్కెట్‌లో జియో సరికొత్త రికార్డు
- జియో ఐపీఓకు మార్గం సుగమం..
- ఇన్వెస్టర్ల చూపంతా ఈ ఇష్యూపైనే
Jio IPO SEBI : భారత ఐపీఓ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రముఖ బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ అతి త్వరలో భారత స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.37,700 కోట్లు) సమీకరించే లక్ష్యంతో ఐపీఓ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ప్రతిపాదిత ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సెబీ ఆమోదంతో భారత మార్కెట్లోనే ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓగా నిలిచే ఛాన్స్ ఉంది.
గత జూన్‌లో ఐపీఓ కోసం జియో ప్లాట్‌ఫామ్స్ డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను సెబీకి (SEBI)కి సమర్పించింది. ఆగస్టు 28న కంట్రోలింగ్ సంస్థ పరిశీలనలు జారీ చేసినట్లు సమాచారం. సెబీ నుంచి పరిశీలనలు రావడంతో ఐపీఓ ప్రాసెస్ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే కీలకమైన దశకు చేరుకున్నట్టేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఐపీఓ తేదీలు, ధరల రేంజ్ ఏంటి అనేది కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
రూ.27,500 కోట్లు రుణ చెల్లింపు :
DRHP ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్ కొన్ని కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బుక్ బిల్డింగ్ విధానంలో ఇష్యూ ధర నిర్ణయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తంలో సుమారు రూ.27,500 కోట్లను రుణాల చెల్లింపునకు కేటాయించాలని కంపెనీ ప్రతిపాదించింది.
Read Also : Insta-Facebook Teen : మెటా సంచలనం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. వాళ్లకు రోజుకు 2 గంటలే..!
మిగిలిన ఫండ్స్ సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43శాతం, మెటాకు 9.98శాతం, గూగుల్‌కు 7.73శాతం వాటా ఉంది. నికర ఇష్యూలో కనీసం 35శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండనుంది.
52.44 కోట్లకు జియో కస్టమర్లు :
మార్చి 31, 2026 నాటికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కస్టమర్ల సంఖ్య 524.4 మిలియన్లకు చేరింది. దేశ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో జియోకు సుమారు 50శాతం వాటా ఉండగా, వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60శాతం వాటాను అందిస్తోంది.
జియో ఐపీఓతో పాటు NSE కూడా పబ్లిక్ ఇష్యూకు రెడీ అవుతోంది. ఈ 2 మెగా ఐపీఓలు కలిసి రూ.67,000 కోట్లకు పైగా సమీకరించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో భారత ఐపీఓ మార్కెట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
