తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. యుద్ద ప్రాతిపదికన టెలికాం నెట్‌వర్క్‌ను పునరుద్దరించిన జియో
భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా దెబ్బతిన్న టెలికాం నెట్‌వర్క్‌ను రిలయన్స్ జియో యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించింది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : September 4, 2024 / 11:30 AM IST
Jio: అసాధారణమైన వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం నెట్‌వర్క్ పూర్తిగా దెబ్బతింది. పౌరులు, రక్షణ సిబ్బంది అవసరమైన సమాచార మార్పిడికి.. సమన్వయానికి మార్గం లేకుండా పోవడంతో వరద ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
తన వంతు బాధ్యతగా రిలయన్స్ జియో తక్షణమే ముందడుగు వేసింది. వరదల వల్ల దెబ్బతిన్న టెలికాం నెట్వర్క్‌ను యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించింది. జియో నెట్‌వర్క్, మెయింటెనెన్స్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను సైతం ఎదుర్కొని పూర్తి తోడ్పాటును అందించారు. ఫలితంగా అతి తక్కువ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో జియో తన నెట్వర్క్ కవరేజ్‌ను తిరిగి ఇవ్వగలిగింది. వరద పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాని చోట్ల కూడా నెట్‌వర్క్‌ను పునరుద్ధరించేందుకు జియో సంసిద్దంగా ఉంది.
Also Read : భవిష్యత్ అంతా బంగారందేనా.. గోల్డ్ నిల్వల్లో ప్రపంచంలో రిచ్చెస్ట్ కంట్రీ ఏదో తెలుసా..?
