Lenovo Power Bank : 100W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీతో లెనోవా లెజియన్ P5 పవర్‌బ్యాంక్.. ధర ఎంతో తెలుసా?
Lenovo Power Bank : లెనోవో సరికొత్త లెనోవో లెజియన్ P5 పవర్ బ్యాంకు లాంచ్ అయింది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఫీచర్లు, ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.
- Sreehari A
- Updated on- May 15, 2026 / 07:04 PM IST
Lenovo Power Bank ( Image Credit : AI )
- USB-C ద్వారా 100W వరకు అవుట్‌పుట్ ఆప్షన్
- చిన్న డివైజ్ ఛార్జ్ కోసం లో-కరెంట్ ఛార్జింగ్ మోడ్ ఆప్షన్
- ఇంటర్నల్ 24 సెం.మీ. పొడవుతో సిలికాన్ కేబుల్ వస్తుంది
Lenovo Power Bank : లెనోవో నుంచి సరికొత్త లెనోవో లెజియన్ P5 అనే కొత్త పవర్ బ్యాంక్ వచ్చేసింది. ఈ పవర్ బ్యాంక్ 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 100W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో ఇంటర్నల్ USB-C కేబుల్, సింగిల్ USB-C పోర్ట్, జనరల్ USB-A పోర్ట్ ఉన్నాయి.
USB-C ద్వారా 100W వరకు అవుట్‌పుట్ అందిస్తుంది. ఇందులో లో-కరెంట్ ఛార్జింగ్ మోడ్ కూడా ఉంది. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ వంటి చిన్న డివైజ్ లను ఛార్జ్ చేయొచ్చు. ఈ పవర్ బ్యాంకు ధర, పూర్తి ఫీచర్లకు సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లెనోవో లెజియన్ P5 ధర :
లెనోవో లెజియన్ పి5 ధర 169 యువాన్లు (సుమారు రూ. 10వేలు). కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (JD.com)లో కొనుగోలుకు అందుబాటులో ఉంది . కంపెనీ ప్రస్తుతం ఈ పవర్ బ్యాంక్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్ చేయగా సేల్స్ మే 19న ప్రారంభం కానున్నాయి.
Read Also : New Gmail Accounts : జీమెయిల్ యూజర్లకు బిగ్ షాక్! ఇకపై 15GB ఫ్రీ స్టోరేజ్ ఉండదు.. గూగుల్ కొత్త రూల్స్ ఇవే!
లెనోవో లెజియన్ P5 స్పెసిఫికేషన్లు :
లెనోవో లెజియన్ P5లో 10,000mAh బ్యాటరీ ఉంది. 100W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బ్యాంక్ కోసం 24-సెంటీమీటర్ల కేబుల్ వస్తుంది. ఇది సిలికాన్ కేబుల్ తెగదు.. వంగదు.. అనమాట. ఈ పవర్ బ్యాంక్ ఫ్రంట్ సైడ్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే రియల్-టైమ్ ఛార్జింగ్ వాట్స్, మిగిలిన బ్యాటరీ, ఇంకా ఇన్‌పుట్ అవుట్‌పుట్ ఇండికేటర్‌లను చూపిస్తుంది.
ఈ పవర్ బ్యాంక్‌లో 4 ఆటోమోటివ్-గ్రేడ్ బ్యాటరీ సిలిండర్లు ఉన్నాయి. 36.72Wh పవర్ అందిస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో ఇంటర్నల్ USB-C కేబుల్, సింగిల్ USB-C పోర్ట్, స్టాండర్డ్ USB-A పోర్ట్ ఉన్నాయి.
USB-C ద్వారా 100W వరకు USB-A ద్వారా 30W వరకు అవుట్‌పుట్ అందిస్తుంది. ఒకేసారి అనేక డివైజ్‌లను ఛార్జ్ చేయగలదు. బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. పవర్ బ్యాంకు ఛార్జ్ అయ్యే సమయంలో మీ ఫోన్ కూడా ఛార్జ్ చేయొచ్చు.
పీడీ 3.0, పీపీఎస్, క్యూసీ, మోటరోలా 68W టర్బో పవర్ వంటి ఛార్జింగ్ ప్రోటోకాల్‌లకు సపోర్టు ఇస్తుంది. ఇందులో లో-పవర్ ఛార్జింగ్ మోడ్ కూడా ఉంది. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ వంటి చిన్న డివైజ్ లు ఛార్జ్ చేయొచ్చు. పవర్ బటన్‌ను 3 సెకన్ల పాటు ట్యాప్ చేసి పట్టుకుంటే ఈ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఈ డివైజ్ కొలతలు 141 x 63.6 x 24mm, బరువు 296 గ్రాములు ఉంటుంది.
