New Gmail Accounts : జీమెయిల్ యూజర్లకు బిగ్ షాక్! ఇకపై 15GB ఫ్రీ స్టోరేజ్ ఉండదు.. గూగుల్ కొత్త రూల్స్ ఇవే!
New Gmail Accounts : గూగుల్ జీమెయిల్ యూజర్ల కోసం 15GB ఫ్రీ స్టోరేజీ బదులుగా కేవలం 5GB ఫ్రీ స్టోరేజీ మాత్రమే అందిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్ వేయండి,
New Gmail Accounts ( Image Credit : AI )
- కొత్త గూగుల్ జీమెయిల్ అకౌంట్లను క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు
- కొత్త యూజర్లు మొబైల్ నంబర్‌తో జీమెయిల్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి
- యూజర్ల సేఫ్టీ బెనిఫిట్స్ కోసం జీమెయిల్ ఈ కొత్త రూల్ ప్రవేశపెట్టింది
New Gmail Accounts : జీమెయిల్ యూజర్లకు గూగుల్ బిగ్ షాక్.. ఇకపై జీమెయిల్ అకౌంట్లలో 15GB స్టోరేజ్ అందుబాటులో ఉండదు. జీమెయిల్ స్టోరేజీకి సంబంధించి కంపెనీ కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ సమయంలో యూజర్లకు మొదట్లో 15GB ఫ్రీ స్టోరేజ్ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అలా ఉండదు.
15GB ఫ్రీ స్టోరేజ్‌కు బదులుగా, యూజర్లకు ఇప్పుడు కేవలం 5GB ఫ్రీ స్టోరేజ్ మాత్రమే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో యూజర్లు మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకుంటే గతంలో మాదిరిగానే 15GB ఫ్రీ స్టోరేజ్ లభిస్తుంది.
కానీ, కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం ఇకపై అంత ఈజీ కాదు. నివేదికల ప్రకారం.. కొత్త జీమెయిల్ యూజర్లు ఇకపై తమ ఖాతాను మొబైల్ నంబర్‌తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో కంపెనీ 15GB ఫ్రీ స్టోరేజ్‌ను అందించదు. కేవలం 5GB స్టోరేజ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ రూల్ జీమెయిల్‌తో పాటు గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలకు కూడా వర్తిస్తుంది. వినియోగదారులకు క్వాలిటీ స్టోరేజ్ సర్వీసులను అందించాలని కోరుకుంటున్నట్లు గూగుల్ ఆండ్రాయిడ్ అథారిటీకి తెలిపింది. ఈ కొత్త విధానాన్ని యూజర్ల సేఫ్టీ బెనిఫిట్స్ కోసం కూడా టెస్టింగ్ చేస్తోంది.
గూగుల్ నిబంధనలను ఎందుకు మార్చింది? :
కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే నిబంధనలను మార్చినట్లు గూగుల్ పేర్కొంది. ఫేక్ అకౌంట్లను స్టోరేజ్‌ను దుర్వినియోగం చేసే యూజర్లను చెక్ చేసేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. కొన్నిసార్లు బాట్లు కూడా జీమెయిల్ అకౌంట్లకు ముప్పే ఉంటుంది.
అందుకే దీనికి కూడా కంపెనీ సింగిల్ చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసింది. కొంతమంది జీమెయిల్ యూజర్లు ఆటోమేటెడ్ సిస్టమ్‌లు కొత్త అకౌంట్లను క్రియేట్ చేస్తూ స్టోరేజ్దుర్వినియోగం చేస్తున్నారని గూగుల్ చెబుతోంది. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ద్వారా యూజర్లను గుర్తించవచ్చు. అకౌంట్ దుర్వినియోగం కాకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌లు, హార్డ్వేర్ల కొరత ఏర్పడింది. కంపెనీ స్టోరేజీ ఖర్చులు పెరిగాయి. ఈ కారణంగానే కంపెనీ తక్కువ స్టోరేజీ అందించాలని నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ స్టోరేజ్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీల మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ నిర్ణయంతో యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను షేర్ చేయాల్సి వస్తుంది. చాలా మంది జీమెయిల్ యూజర్లకు ఇబ్బందికరంగా మారొచ్చు.
ఏ ఆన్లైన్ పోర్టల్లోనూ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసేందుకు ఇష్టపడని యూజర్లకు పెద్ద సమస్య కావచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త రూల్ కేవలం కొత్త జీమెయిల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. పాత జీమెయిల్ అకౌంట్లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.
