LG French Door Refrigerators : వావ్..! LG నుంచి కొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు.. ఇక 24 గంటలూ ఐస్ రెడీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

LG French Door Refrigerators : ఎల్ జీ కంపెనీ నుంచి సరికొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయి.. ఆటో ఐస్ మేకర్, వాటర్ లైన్ లేకుండా 24 గంటల పాటు ఐస్ రెడీగా ఉంటుంది. స్పెషిఫికేషన్లు, ధరలపై పూర్తి వివరాలివే..

LG French Door Refrigerators

  • LG 574L-610L సామర్థ్యంతో కొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు లాంచ్
  • ఆటో ఐస్ మేకర్, వాటర్ లైన్ లేకుండా 24 గంటలూ ఐస్‌ సపోర్టు
  • ఎల్జీ రిటైల్ ఛానెళ్లలో ధరలు రూ. 1.18 లక్షల నుంచి ప్రారంభం

LG French Door Refrigerators : కొత్త ఫ్రిజ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? గత కొన్నేళ్లుగా భారత ప్రీమియం రిఫ్రిజిరేటర్ సెగ్మెంట్ వేగంగా డెవలప్ అవుతోంది. వినియోగదారులు కూడా హై కెపాసిటీ రిఫ్రిజిరేటర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. స్పెషల్ బిగ్ సైజు ఫ్రెంచ్-డోర్ రిఫ్రిజిరేటర్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. వినియోగారులను ఆకర్షించేందుకు తయారీదారులు కూడా బిగ్ సైజ్ రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

లేటెస్టుగా ఎల్జీ (LG) కూడా కొత్త ఫ్రెంచ్-డోర్ రిఫ్రిజిరేటర్ రేంజ్ ప్రీమియం హోం అప్లియన్సెస్ లైనప్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సరికొత్త ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఈ కొత్త రిఫ్రిజిరేటర్ లైనప్ స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు, స్పెసిఫికేషన్లు :
కెపాసిటీ విషయానికి వస్తే.. ఈ కొత్త ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ల రేంజ్ 574L నుంచి 610L సామర్థ్యాల వరకు లభిస్తుంది. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. ఈ కొత్త రిఫ్రిజిరేటర్లు గ్లాస్, స్టీల్ ఫినిషింగ్‌లలో అందుబాటులో ఉన్నాయి. 4 డోర్ల సెటప్ ఉంటుంది.

ఇందులో రిఫ్రిజిరేటర్ పార్ట్ పైన ఫ్రీజర్ కింద ఉంటుంది. అదనంగా ఎల్‌జీ ఇన్‌స్టా వ్యూ ప్యానెల్ కూడా ఉంది. డోర్ ఓపెన్ చేయకుండానే రెండుసార్లు ఫుష్ చేసి లోపల చూడొచ్చు.

Read Also : Helmet Buying Guide : హెల్మెట్ కొంటున్నారా..? సేఫ్టీ కోసం ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!

అంతేకాదు.. ఇందులో ఫ్రెష్ కన్వర్టెర్ ప్లస్ కూడా ఉంది. అనేక రకాల ఆహార పదార్థాల కోసం టెంపరేచర్ అడ్జెస్ట్ చేసేందుకు స్పెషల్ బాక్సు కూడా అందిస్తుంది. అయితే, ఇందులో ముఖ్యమైన ఫీచర్లలో ఆటో ఐస్ మేకర్ ఒకటి. వాటర్ లైన్ అవసరం లేకుండా 24 గంటలూ ఐస్ ప్రొడ్యూస్ చేసేందుకు రీఫిల్ వాటర్ ట్యాంక్‌ అమర్చారు.

ఫీచర్ల విషయానికి వస్తే..
ఫాస్ట్ కూలింగ్ కోసం డోర్ కూలింగ్ ప్లస్, బ్యాక్టీరియా, బ్యాడ్ స్మెల్ రాకుండా హైజీన్ ఫ్రెష్ ప్లస్ ఉన్నాయి. స్మార్ట్ డివైజ్ ద్వారా రిమోట్ మానిటరింగ్, కంట్రోలింగ్ కోసం ఈ రిఫ్రిజిరేటర్లు ఎల్జీ (ThinQ Wi-Fi) కనెక్టివిటీతో వస్తాయి.

ధర, లభ్యత :
ధర, లభ్యత విషయానికి వస్తే.. ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ రేంజ్ భారత మార్కెట్లో LG రిటైల్ ఛానెళ్లు, ప్రముఖ స్టోర్లలో రూ. 1.18 లక్షల నుంచి అందుబాటులో ఉంది.