Gold Rates Hike : పసిడి పరుగు.. త్వరలో తులం గోల్డ్ రేటు రూ.2లక్షలకు చేరుతుందా..? నిపుణులు చెప్పే అంశాలే..
Gold Price Hike : బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో తులం గోల్డ్ రేటు రూ.2లక్షలకు చేరుతుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Gold Price Hike
Gold Rates Hike : జ్యూవెలరీ షాపుల వంక చూడాలంటేనే భయపడేలా బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఈ వారం ఉన్న రేట్లు వచ్చేవారం ఉండట్లేదు. ఆ రకంగా గోల్డ్ ర్యాలీ అప్ ట్రెండ్‌లో మళ్ళీ కొనసాగుతోంది.. దీంతో పసిడి ధర త్వరలో తులం రేటు రూ.2లక్షలకు చేరుతుందా అన్న అనుమానాలు, ఆందోళనలు సామాన్యులలో కలుగుతున్నాయి.
Also Read : Vivo V70 Elite : వివోనా మజాకా.. 50MP ట్రిపుల్ కెమెరా ఫోన్ ఇప్పుడు రూ. 11వేలు తగ్గింపుతో.. ఎలాగంటే?
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అదే విధంగా బులియన్ మార్కెట్లలో ఈ ఏడాది ప్రారంభం మాదిరిగా గోల్డ్ రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. క్రమంగా గోల్డ్ రేటు తులం రూ. 1.70లక్షల దిశగా దూసుకెళ్తోంది. వారంరోజుల వ్యవధిలో తులంపై 8 నుంచి 10 వేల రూపాయలు బంగారం ధర పెరగడం గోల్డ్ అప్‌ట్రెండ్‌కు నిదర్శనం. రానున్న రోజుల్లోనూ గోల్డ్ అప్ ట్రెండ్ చాన్స్ ఉందని అంటున్నారు. అంటే వచ్చే రోజుల్లో తులం గోల్డ్ రేటు రూ.2లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు లక్షా 62 వేల నుంచి లక్షా 65 వేల రూపాయల మధ్య ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4వేల 500 డాలర్ల మైలురాయిని దాటింది. గ్లోబల్ టెన్షన్స్, జియో పాలిటిక్స్ ఇలాగే కొనసాగితే.. రాబోయే ఒకట్రెండు సంవత్సరాల్లోనే గోల్డ్ ధర రూ. 2లక్షల మార్కును తాకే అవకాశం ఉందనేది మార్కెట్ నిపుణుల అంచనా.
యుఎస్ ట్రెజరీ నిర్ణయాలు, వడ్డీ రేట్ల పై అనిశ్చితి, యుఎస్ డాలర్ ఇండెక్స్ క్షీణించడం వల్ల బంగారానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారం వాటాను నిరంతరం పెంచుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల దేశీయ మార్కెట్లో దిగుమతి చేసుకునే పసిడి వ్యయం పెరుగుతోంది. గోల్డ్ ఎఫ్‌టీఎఫ్‌లు, కాల్ ఆప్షన్లలో సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కూడా ధరల ర్యాలీకి బలమిస్తోంది. దీర్ఘకాలంలో పసిడి ట్రెండ్ బుల్లిష్‌గా ఉన్నప్పటికీ, మధ్యమధ్యలో లాభాల స్వీకరణవల్ల ధరల్లో స్వల్పకాలిక తగ్గుదల లేదా దిద్దుబాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
