×
Ad

MacBook Air M4 Price : బ్లింకిట్‌లో బంపర్ డిస్కౌంట్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 రూ.80,499కే.. జస్ట్ 20 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

MacBook Air M4 Price : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ఇప్పుడు బ్లింకిట్ ప్లాట్‌ఫారంపై భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ వేరియంట్ 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే , 16GB ర్యామ్, 256GB SSD స్టోరేజీతో వస్తుంది.

MacBook Air M4 Price

  • బ్లింకిట్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గింపు
  • లాంచ్ ధర రూ.99,900 నుంచి రూ.90,499కి తగ్గింపు
  • బ్యాంకు ఆఫర్లు, క్రెడిట్ కార్డులతో రూ. 10వేలు డిస్కౌంట్
  • కేవలం 20 నిమిషాల లోపే కొత్త ల్యాప్‌టాప్ హోం డెలివరీ

MacBook Air M4 Price : కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఎయిర్ M4 వేరియంట్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 2025లో ఈ మ్యాక్ బుక్ ఎయిర్ లాంచ్ కాగా, ప్రొఫెషనల్, పర్సనల్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ అన్ని ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పుడు, ఈ మ్యాక్ బుక్ పాపులర్ కమర్షియల్ ప్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఆర్డర్ చేయడమే ఆలస్యం.. కేవలం 20 నిమిషాల లోపే కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ M4 మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

బ్లింకిట్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గింపు :
మ్యాక్‌బుక్ ఎయిర్ అసలు లాంచ్ ధర రూ.99,900 ఉండగా ప్రస్తుతం బ్లింకిట్‌లో రూ.90,499కే లభిస్తోంది. తక్కువకే కొనేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు.

దాంతో ఈ మ్యాక్ బుక్ ధర రూ.80,499కి తగ్గుతుంది. ఓపెన్ బాక్స్ డెలివరీ ద్వారా కేవలం 20 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే డెలివరీ అవుతుంది. ఈ మ్యాక్‌బుక్ మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌పైనే డిస్కౌంట్‌ అందిస్తోంది.

Read Also : WhatsApp Security Feature : వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. సింగిల్ క్లిక్‌తో సైబర్, హ్యాకర్లకు చెక్.. ఇప్పుడే సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి!

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మోడల్ 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. 24GB, 32GB వరకు కాన్ఫిగర్ 16GB ర్యామ్ అందిస్తుంది.

అంతేకాదు.. డిస్కౌంట్ ధరలో 256GB SSD స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. మ్యాగ్ సేఫ్ 3 ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో 2 థండర్ బోల్ట్ 4 పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ ల్యాప్‌టాప్ వీడియో కాల్స్ కోసం 12MP సెంటర్ స్టేజ్ కెమెరా అందిస్తుంది.

సెన్సార్ అడ్వాన్స్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్‌తో సపోర్టు ఇస్తుంది. 4 స్పీకర్ సిస్టమ్‌, బీమ్‌ఫార్మింగ్‌తో 3 మిడ్-అరే కూడా ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ 10-కోర్ సీపీయూ 8-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU), M4 చిప్‌సెట్‌తో వస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ల్యాప్‌టాప్ 53.8Whr బ్యాటరీతో పాటు 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.