Apple MacBook Air M5 : AI పవర్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ M5.. ఇప్పుడు రూ.10,400 తక్కువ ధరకే!

Apple MacBook Air M5 : మ్యాక్‌బుక్ ఎయిర్ M5 భారీగా తగ్గిందోచ్.. ఆపిల్ ల్యాప్‌టాప్‌ను కొన్నారంటే రూ.10,400 తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ అదిరే డీల్ ఎలా పొందాలంటే?

  • Published on- September 28, 2026 / 10:00 PM IST

Apple MacBook Air M5

  • రూ. 1,49,900 నుంచి రూ. 1,39,490 తగ్గింపుతో కొనేసుకోవచ్చు
  • అసలు ధర కన్నా 6.94శాతం తక్కువ ధరకు లభిస్తోంది
  • 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ ఆప్షన్ కూడా

Apple MacBook Air M5 : కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం M5 చిప్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ డీల్.. ఇందులో 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ ఉన్నాయి.

కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 1,49,900 ధరకు లాంచ్ చేసింది. ఇప్పుడు రూ. 10వేలకు పైగా తగ్గింపు లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 13.6 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మెమరీ చిప్ ధరల పెంపు కారణంగా ఆపిల్ డివైజ్‌ల ధరలు పెరిగినప్పటికీ ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్‌ను ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మ్యాక్‌బుక్ ఎయిర్ M5 తగ్గింపు ధర :
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 క్రోమాలో తగ్గింపు ధరతో లిస్టు అయింది. అసలు ధర రూ. 149,900కు బదులుగా రూ. 139,490కే కొనేసుకోవచ్చు. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్‌తో సిల్వర్ కలర్ వేరియంట్ ధర అందిస్తుంది. కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌పై రూ. 10,410 తగ్గింపు అందిస్తుంది. అసలు ధరపై 6.94శాతం తక్కువకే ఆఫర్ చేస్తోంది.

Read Also : OnePlus Pad 2 : 9510mAh బ్యాటరీతో వన్‌ప్లస్ ప్యాడ్ 2.. అమెజాన్‌లో ఏకంగా రూ.11,000 తగ్గింపు!

ఈఎంఐ ఆఫర్ :
మీరు ఈఎంఐలో ఆపిల్ ల్యాప్‌టాప్‌ను కొనేసుకోవచ్చు. క్రోమా సంస్థ రూ. 7వేల కన్నా తక్కువకే లభిస్తోంది. కేవలం రూ. 6,566 నెలవారీ వాయిదాతో ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే, ఎంచుకునే పేమెంట్ మెథడ్ బట్టి ఫైనల్ ఈఎంఐ ధర ఉంటుంది.

సేల్, ఫ్రీ యాక్సెసరీ :
మ్యాక్‌బుక్ ఎయిర్ M5 సేల్, కంపెనీ ఫ్రీ రివార్డు కూడా అందిస్తోంది. మీరు కొనుగోలు చేస్తే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్‌లో హైపెన్ 4-ఇన్-1 ఎసిన్సెషియల్స్ కాంబోను పూర్తిగా ఫ్రీగా పొందుతారు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మ్యాక్‌బుక్ ఎయిర్ M5 డివైజ్ 13-అంగుళాల మోడల్‌లో 2560 x 1664 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 13.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 12MP సెంటర్ స్టేజ్ వెబ్‌క్యామ్ ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M5 డివైజ్ M5 చిప్‌సెట్ అందిస్తుంది. ర్యామ్ 16GB నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ర్యామ్, SSD కస్టమైజ్ చేసుకోవచ్చు.

కనెక్టివిటీ విషయానికి వస్తే..
ఈ ల్యాప్‌టాప్‌లో N1 వైర్‌లెస్ చిప్ ఉంది. Wi-Fi 7 (802.11be), బ్లూటూత్ 6, థ్రెడ్ నెట్‌వర్కింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 2 థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లతో పాటు 3.5mm జాక్‌కు కూడా సపోర్టు ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M5లో 53.8Wh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. 18 గంటల వరకు స్ట్రీమింగ్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మ్యాగ్‌సేఫ్ 3 మాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్‌తో కూడా వస్తుంది.