Telugu » Business » Mahindra Xuv 400 Is Available With A Discount Of Rs 4 45 Lakh Check Full Details Sh
Mahindra XUV 400 : కొంటే ఈ మహీంద్రా కారు కొనాలి.. ఏకంగా రూ. 4.45 లక్షల డిస్కౌంట్.. లాస్ట్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!
Mahindra XUV 400 : డిసెంబర్ 31 వరకు మహీంద్రా SUVలపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. మహీంద్రా పాపులర్ SUV XUV400 కారుపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది.
Mahindra XUV 400 : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఈ నెలలో అనేక పాపులర్ SUVలపై కిర్రాక్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు రాబోయే రోజుల్లో మహీంద్రా SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. డిసెంబర్ 31 వరకు మహీంద్రా SUVలపై లక్షల రూపాయల డిస్కౌంట్లు పొందవచ్చు.
2/5
ఈ ఏడాది చివరి రోజుల్లో అమ్మకాల కోసం MY2025 స్టాక్ క్లియరింగ్ కోసం మహీంద్రా ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. మహీంద్రా పాపులర్ SUV, మహీంద్రా XUV400 విషయానికి వస్తే.. కంపెనీ ప్రస్తుతం XUV400పై అత్యధిక డిస్కౌంట్ అందిస్తోంది. ఈ SUVపై ప్రస్తుతం రూ. 4.45 లక్షల వరకు ఆఫర్లు అందిస్తున్నారు. మీరు మహీంద్రా XUV400 కారును తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
3/5
మహీంద్రా XUV 400 ధర ఎంతంటే? : ముందుగా మహీంద్రా XUV 400 కారు ధర విషయానికి వస్తే.. మహీంద్రా XUV400 ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. SUV ఆన్-రోడ్ ధర రూ. 16.71 లక్షలు (ఎక్స్-షోరూమ్) పొందవచ్చు. డిసెంబర్‌లో ఈ మోడల్ కొనుగోలు చేయడం ద్వారా లక్షల రూపాయల తగ్గింపు పొందవచ్చు.
4/5
మహీంద్రా XUV 400పై డిస్కౌంట్ : మహీంద్రా XUV 400పై రూ. 4.45 లక్షల (ఎక్స్-షోరూమ్) డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు కారు మోడల్, వేరియంట్, ప్రాంతం, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు.
5/5
మహీంద్రా కార్ల డిస్కౌంట్లు : మహీంద్రా XUV 400తో పాటు, మహీంద్రా అనేక ఇతర SUVలపై డిస్కౌంట్లను అందిస్తోంది. మహీంద్రా XUV 3XO ధర రూ. 1.14 లక్షలు ఉంటే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధర రూ. 1.40 లక్షలుగా ఉంది. మహీంద్రా స్కార్పియో N ధర రూ. 85,600కు ఉంటే మహీంద్రా థార్ రాక్ రూ. 1.20 లక్షలుగా ఉంది. మహీంద్రా XUV 700 ధర రూ. 1.55 లక్షలు ఉంటుంది.