Best Phones 2025 : ఢీ అంటే ఢీ.. శాంసంగ్ గెలాక్సీ FE జూజూబీ.. ఈ 5 కెమెరా ఫోన్లే తోపు భయ్యా.. శాంసంగ్ లవర్స్ ఇవే కొనేస్తారు!
Best Phones 2025 : శాంసంగ్ గెలాక్సీ S25 FE కన్నా బెటర్ ఫీచర్లతో అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Phones 2025
Best Phones 2025 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఫీచర్లతో కిర్రాక్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు శాంసంగ్ గెలాక్సీ S25 FE కొనాలనుకుంటే అంతకన్నా తోపు ఫీచర్లు ఉన్న ఫోన్లపై ఓసారి లుక్కేయండి.. ఒకసారి చూశారంటే ఈ ఫోన్లనే కొనేస్తామంటారు. ప్రత్యేకించి కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ టాప్ ప్లేసులో దూసుకుపోతోంది. అలాగే ఇతర బ్రాండ్ల ఫోన్లు కూడా తక్కువేం కాదు.
ఈ టాప్ 5 ఫోన్లలో కెమెరా ఫీచర్లు మాత్రం (Best Phones 2025) కేక ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయంలో అసలు అనుమానమే లేదు.. అంతా బాగుంటాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే శాంసంగ్ గెలాక్సీ S25 FEకి గట్టి పోటీ ఇస్తున్నాయి. మీరు నిజంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ కొనాలనుకుంటే ఈ ఫోన్లలో వివో నుంచి ఒప్పో వరకు అద్భుతమైన ఫోన్లు ఉన్నాయి.. ఏది కొంటారో కొనేసుకోండి.
వన్‌ప్లస్ 15R (రూ. 44,999) :
వన్‌ప్లస్ 15R ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7400mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆక్సిజన్ OS16పై రన్ అవుతుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆప్టిక్స్ కోసం 50MP + 8MP కెమెరాను కలిగి ఉంది.
వివో X200 FE (రూ. 54,999) :
వివో X200 FE 1B కలర్స్‌తో 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 50MP + 8MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, 6500mAh బ్యాటరీతో నిండి ఉంది.
ఐఫోన్ 16e (రూ. 51,490) :
ఆపిల్ ఐఫోన్ 16e డ్యూయల్ 48MP రియర్ కెమెరాతో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. iOS 26.2పై రన్ అవుతుంది. 8W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4005mAh బ్యాటరీని కలిగి ఉంది.
గూగుల్ పిక్సెల్ 9A (రూ. 42,999) :
గూగుల్ పిక్సెల్ 9Aలో 48MP + 13MP బ్యాక్ కెమెరా 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6.3-అంగుళాల P-OLED డిస్‌ప్లేకు సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన 5100mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో రెనో 14 ప్రో (రూ. 47,999) :
ఒప్పో రెనో 14 ప్రో మోడల్ 6200mAh బ్యాటరీ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 4nm చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ 50MP కెమెరాను అందిస్తుంది.
