Triumph Bikes Price : బిగ్ షాకింగ్.. భారీగా పెరగనున్న ట్రయంఫ్ బైకుల ధరలు.. జనవరి 1 నుంచే అమల్లోకి.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

Triumph Bikes Price : కొత్త ట్రయంఫ్ బైకుల కొత్త ధరలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. తన అన్ని బైక్‌ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ట్రయంఫ్ కొత్త బైక్ కొనాలంటే డిసెంబర్ చివరి వరకు ఛాన్స్.. ఇప్పుడే బుక్ చేసుకోండి.

Triumph Bikes Price : బిగ్ షాకింగ్.. భారీగా పెరగనున్న ట్రయంఫ్ బైకుల ధరలు.. జనవరి 1 నుంచే అమల్లోకి.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

Triumph Bikes Price

Updated On : December 27, 2025 / 8:06 PM IST

Triumph Bikes Price : కొత్త బైక్ కొంటున్నారా? అయితే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఎందుకంటే 2026లో ప్రీమియం బైకుల ధరలు అమాంతం పెరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బైకులను అందించే ప్రముఖ కంపెనీ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారతీయ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది.

స్పీడ్ 400 స్క్రాంబ్లర్ ఎక్స్ సహా అనేక బైక్ మోడళ్ల (Triumph Bikes Price) ధరలను అమాతం పెంచేసింది. ఈ కంపెనీ జనవరి 1, 2026 నుంచి అన్ని ట్రయంఫ్ బైక్‌ల ధరలు పెరుగుతాయని ప్రకటించింది. ట్రయంఫ్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు ఇదే సువర్ణావకాశం. డిసెంబర్ 2025 చివరి వరకు ప్రస్తుత ధరలకు బుకింగ్‌లు చేసుకోండి.

జీఎస్టీ మారినా ధరలు పెరగలేదు :
350cc కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లకు జీఎస్టీ శ్లాబ్‌లో ఇటీవల మార్పులు చేసినా ధరలను పెంచలేదు. స్పీడ్ 400 స్పీడ్ T4లపై స్పెషల్ పండుగ ధరలను కూడా అందించామని కంపెనీ పేర్కొంది. ఆ సమయంలో ఇన్‌పుట్ ఖర్చులను కంపెనీ స్వయంగా భరించింది. ఇప్పుడు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని చెబుతోంది.

ప్రీమియం క్వాలిటీ ప్రొడక్టులు, సర్వీసులపై ప్రాధాన్యత :
ట్రయంఫ్ బైకుల ధరల పెరుగుదల గురించి బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ మాణిక్ నంగియా మాట్లాడుతూ.. కంపెనీ డీలర్లు కస్టమర్లకు ప్రీమియం క్వాలిటీ ప్రొడక్టులను సర్వీసులను అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ట్రయంఫ్ బైకులను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు ప్రస్తుత ధరల ప్రయోజనాన్ని పొందడానికి డిసెంబర్ 2025 చివరిలోపు కొనుగోలు చేసుకోవచ్చు.

ట్రయంఫ్ బైకుల పూర్తి ధరలివే :

  • ట్రయంఫ్ స్పీడ్ T4 ధర: రూ. 1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ట్రయంఫ్ స్పీడ్ 400 ధర: రూ. 2.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X ధర: రూ. 2.68 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ట్రయంఫ్ థ్రక్స్టన్ 400 ధర: రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ట్రైడెంట్ 660 ధర : రూ. 8.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • డేటోనా 660 ధర : రూ. 9.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • స్ట్రీట్ ట్రిపుల్ 765 R ధర: రూ. 10.86 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • స్ట్రీట్ ట్రిపుల్ 765 RS ధర : రూ. 13.23 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • స్పీడ్ ట్రిపుల్ 1200 RS ధర : రూ. 17.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • స్పీడ్ ట్విన్ 900 ధర : రూ. 9.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • బోన్నెవిల్లే T100 ధర : రూ. 10.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • బోన్నెవిల్లే T120 ధర : రూ. 11.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • బోన్నెవిల్లే బాబర్ ధర : రూ. 12.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • స్పీడ్ మాస్టర్ ధర షోరూమ్ ధర: రూ. 12.88 లక్షలు
  • స్పీడ్ ట్విన్ 1200 (ఎక్స్-షోరూమ్) ధర : రూ. 13.84 లక్షలు
  • టైగర్ స్పోర్ట్ 660 (ఎక్స్-షోరూమ్) ధర : రూ. 9.45 లక్షలు
  • టైగర్ 900 GT/ర్యాలీ ప్రో (ఎక్స్-షోరూమ్) ధర : రూ. 14.40 లక్షల నుంచి రూ. 16.15 లక్షల వరకు
  • టైగర్ 1200 GT/ర్యాలీ (ఎక్స్-షోరూమ్) ధర : రూ. 19.39 లక్షల నుంచి రూ. 21.89 లక్షల వరకు
  • రాకెట్ 3 స్టార్మ్ R (ఎక్స్-షోరూమ్) ధర : రూ. 24.03 లక్షలు
  • రాకెట్ 3 స్టార్మ్ GT (ఎక్స్-షోరూమ్) ధర : రూ. 24.67 లక్షలు