Triumph Bikes Price
Triumph Bikes Price : కొత్త బైక్ కొంటున్నారా? అయితే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఎందుకంటే 2026లో ప్రీమియం బైకుల ధరలు అమాంతం పెరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బైకులను అందించే ప్రముఖ కంపెనీ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారతీయ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది.
స్పీడ్ 400 స్క్రాంబ్లర్ ఎక్స్ సహా అనేక బైక్ మోడళ్ల (Triumph Bikes Price) ధరలను అమాతం పెంచేసింది. ఈ కంపెనీ జనవరి 1, 2026 నుంచి అన్ని ట్రయంఫ్ బైక్‌ల ధరలు పెరుగుతాయని ప్రకటించింది. ట్రయంఫ్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు ఇదే సువర్ణావకాశం. డిసెంబర్ 2025 చివరి వరకు ప్రస్తుత ధరలకు బుకింగ్‌లు చేసుకోండి.
జీఎస్టీ మారినా ధరలు పెరగలేదు :
350cc కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లకు జీఎస్టీ శ్లాబ్‌లో ఇటీవల మార్పులు చేసినా ధరలను పెంచలేదు. స్పీడ్ 400 స్పీడ్ T4లపై స్పెషల్ పండుగ ధరలను కూడా అందించామని కంపెనీ పేర్కొంది. ఆ సమయంలో ఇన్‌పుట్ ఖర్చులను కంపెనీ స్వయంగా భరించింది. ఇప్పుడు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని చెబుతోంది.
ప్రీమియం క్వాలిటీ ప్రొడక్టులు, సర్వీసులపై ప్రాధాన్యత :
ట్రయంఫ్ బైకుల ధరల పెరుగుదల గురించి బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ మాణిక్ నంగియా మాట్లాడుతూ.. కంపెనీ డీలర్లు కస్టమర్లకు ప్రీమియం క్వాలిటీ ప్రొడక్టులను సర్వీసులను అందించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ట్రయంఫ్ బైకులను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు ప్రస్తుత ధరల ప్రయోజనాన్ని పొందడానికి డిసెంబర్ 2025 చివరిలోపు కొనుగోలు చేసుకోవచ్చు.
ట్రయంఫ్ బైకుల పూర్తి ధరలివే :