Gold Silver Price : బంగారం, వెండి ధరలు పైపైకి.. అసలు కారణం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
Gold Silver Price : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..
Gold Silver Price
Gold Silver Price : బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఫలితంగా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. శనివారం కిలో వెండిపై రూ.20వేలు పెరగడం గమనార్హం.
అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకంటే తగ్గిన నేపథ్యంలో.. అదేవిధంగా తదుపరి సమీక్షలోనూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరగడం.. ఆర్థిక అనిశ్చితులు తొలగకపోవడంతో సుస్థిరమైన భావనతో విలువైన బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. గిరాకీకి తగ్గట్టు వెండి సరఫరా లేదని, అందువల్ల ధరలు పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో ఎక్కువమంది ఇన్వెస్టర్లు వెండిపై పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24, 22 క్యారట్ల బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్‌పై 55 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్సు గోల్డ్ 4534 డాలర్ల వద్దకు చేరుకుంది. మరోవైపు వెండి ధర వేగంగా దూసుకెళ్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,29,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,41,220కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,29,600 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,41,370కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,29,450 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,41,220కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,51,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,74,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
