Maruti Ignis : మారుతి బుల్లి కారు ఇగ్నిస్‌కు గుడ్‌బై.. కొత్త మైక్రో SUV వచ్చేస్తోంది.. టాటా పంచ్‌కు గట్టి పోటీ..!
Maruti Ignis Discontinued : మారుతి సరసమైన హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్‌ను నిలిపివేసింది. ప్రారంభ ధర రూ. 5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు స్థానంలో కొత్త మైక్రో ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది.
- Sreehari A
- Published on- April 16, 2026 / 03:47 PM IST
Maruti Ignis Discontinued
- కొత్త మైక్రో SUVతో ఎంట్రీకి రెడీ
- బడ్జెట్ SUV సెగ్మెంట్‌లో కొత్త సెన్సేషన్
- భారత్ రోడ్లపై మారుతి ఇగ్నిస్ కనిపించదు
Maruti Ignis : కొత్త మారుతి సుజుకి కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్.. భారత మార్కెట్లో ఇకపై మారుతి సుజుకి ఇగ్నిస్ కొనలేరు. నివేదిక ప్రకారం.. పాపులర్ అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారును కంపెనీ నిలిపివేసింది.
ప్రస్తుతం ఈ కారు ధర మార్కెట్లో రూ. 5.35 లక్షల నుంచి రూ.7.55 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండేది. ఈ మోడల్ (Maruti Ignis) ఎక్కువగా నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించేవారు. అయితే, ఇప్పుడు ఈ ఇగ్నిస్ మోడల్ నిలిచిపోనుంది. ఈ కారు స్థానంలో మరో సరికొత్త మైక్రో SUV మోడల్ రాబోతుంది.
టాటా పంచ్‌కు పోటీగా నిలిచే మరో కొత్త మైక్రో-ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. మారుతి కంపెనీ ఇగ్నిస్ కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. డీలర్లు ఇకపై ఇగ్నిస్ కోసం బుకింగ్‌లను తీసుకోవడం లేదు. అయితే, మారుతి సుజుకి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇగ్నిస్ ఇప్పటికీ అధికారిక నెక్సా వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది.
2020లో కొత్త అవతార్ :
ఇగ్నిస్ తొలిసారిగా 2017 ప్రారంభంలో లాంచ్ అయింది. 2020లో ఇందులో ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. ఈ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో భారీగా మార్పులు వచ్చాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ డెల్టా, జీటా ఆల్ఫా అనే 3 మెయిన్ ట్రిమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న సిగ్మా వేరియంట్‌ను ముందుగానే కంపెనీ నిలిపివేసింది.
ఇగ్నిస్‌లో ఆకట్టుకునే ఫీచర్లు :
ఈ చిన్న కారులో ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్‌ప్లేతో 7-అంగుళాల ‘స్మార్ట్ ప్లే’ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, ORVM కోసం ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, వైడ్ రేంజ్ ట్రిమ్‌లలో పుష్-బటన్ స్టార్ట్ ఉన్నాయి. విమానాలలో వాడే తరహా ‘టాగల్-టైప్’ స్విచ్‌లు డిజైన్‌లో కీలక ఫీచర్‌గా నిలిచాయి.
సేఫ్టీ ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజన్ :
ఇగ్నిస్ ఏబీఎస్, ఈబీడీ, ISOFIX మౌంట్లు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అవసరమైన సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 5వ జనరేషన్ హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 83 హార్స్‌పవర్ 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో డ్యూయల్‌జెట్ టెక్నాలజీ లేదు. రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ అందిస్తుంది.
మారుతి సుజుకి కొత్త B-సెగ్మెంట్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం Y43 అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఈ కొత్త SUV మోడల్ హ్యుందాయ్ ఎక్సెంట్ టాటా పంచ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
