Gold Price Today : బంగారం కొనేవారికే చుక్కలే.. పసిడి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంత పెరిగిందంటే?
Gold Price Today April 16 : బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా పసిడి పరుగులు పెడుతోంది. ఏప్రిల్ 16న దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today April 16 : ఇరాన్ యుద్ధం ఒకవైపు.. బంగారం ధరలు మరోవైపు.. అటు యుద్ధం ఆగడం లేదు.. ఇటు బంగారం ధరల దూకుడు తగ్గడం లేదు. మొన్నటివరకూ తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గోల్డ్ ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి.

చమురు సంక్షోభం కూడా బంగారం ధరలపై ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.

ఏప్రిల్ 16 గురువారం నాడు దేశంలో గోల్డ్ ధరలను ఓసారి పరిశీలిస్తే.. 24 క్యారెట్లకు గ్రాము పసిడి ధర రూ.22 పెరిగి రూ.15,557 దగ్గర కొనసాగుతోంది. అలాగే, 22 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.20 పెరిగి రూ.14,260 వద్ద కొనసాగుతోంది.

100 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.2,200 పెరిగి రూ.15,55,700 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములు రూ.2వేలు పెరిగి రూ. 14,26,000 దగ్గర కొనసాగుతోంది. ఈరోజు దేశీయ ప్రధాన నగరాలతో పాటు ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

హైదరాబాద్లో బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.220 పెరిగి ఆపై రూ.1,55,570 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.1,42,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.220 పెరిగి రూ.1,55,570 వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.1,42,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

విశాఖలో ఈరోజు గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.220 పెరిగి ఆపై రూ.1,55,570 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.1,42,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,720 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,750 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,230 వద్ద కొనసాగుతోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,210 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.220 పెరిగి రూ.1,55,570 దగ్గర కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.1,42,600 వద్ద పలుకుతోంది.

బెంగళూరులో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.220 పెరిగి రూ.1,55,570 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,42,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే.. ఈరోజు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖలో రూ. 2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ మాత్రం రూ. 2,70,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
