Maruti Suzuki Brezza Facelift : జస్ట్ రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చాలు.. కొత్త మారుతి బ్రెజ్జా మీ సొంతం! నెలకు EMI ఎంతంటే?
Maruti Suzuki Brezza Facelift : కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను కొనేందుకు కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టాలి. ఈ మారుతి SUV నెలవారీ ఈఎంఐ ఎంతంటే?
- Sreehari A
- Published on- July 26, 2026 / 01:04 PM IST
Maruti Suzuki Brezza Facelift
- భారత మార్కెట్లోకి మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ
- ధర రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం
- కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్, నెలకు ఈఎంఐ ఎంత?
Maruti Suzuki Brezza Facelift : మారుతి లవర్స్ కోసం ఖతర్నాక్ ఫీచర్లతో అద్భుతమైన SUV వచ్చేసింది. మారుతి సుజుకి నుంచి పాపులర్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV బ్రెజ్జా కొత్త ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే డిజైన్, ప్రీమియం ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
ఈ కొత్త SUV కారు కొత్త ఇంజన్ అప్‌డేట్‌తో వచ్చింది. కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కొనాలని అనుకుంటే కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కడితే చాలు.. మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మీ సొంతం అవుతుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి చూద్దాం..
ధర ఎంతంటే? :
కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ధర విషయానికి వస్తే.. మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి (Maruti Suzuki Brezza Facelift) ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 13.09 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మీరు ఢిల్లీలో బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం రూ. 88,116, ఇన్సూరెన్స్ కోసం రూ. 41వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అన్ని ఛార్జీలతో కలిపి మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ధర సుమారుగా రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది.
నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్‌ను రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. మీరు బ్యాంకు నుంచి రూ.6.69 లక్షలు లోన్ తీసుకోవాలి. ఈ లోన్ 3 ఏళ్లకు 9 శాతం వడ్డీ రేటుతో నెలవారీ ఈఎంఐ రూ. 21,274 కట్టాల్సి ఉంటుంది. ఈ మూడేళ్లలో బ్యాంకుకు మొత్తం రూ. 765,865 తిరిగి చెల్లించాలి. ఇందులో కేవలం రూ. 96,865 వడ్డీనే కట్టాల్సి ఉంటుంది.
Read Also : Lava Virat V1 Series : లావా కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. విరాట్ V1 సిరీస్ అదుర్స్.. ధర చాలా చీప్ గురూ..!
డిజైన్, ఫీచర్లు :
మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లుక్, డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఈ కొత్త SUVలో కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ ఫాగ్ ల్యాంప్ పాడ్‌లతో కొత్త బంపర్‌లు, ఆకర్షణీయమైన 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త బ్రెజ్జా అనేక అడ్వాన్స్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.
- ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
- సన్ రూప్ ట్రాక్
- షార్క్ ఫిన్ యాంటెన్నా
- 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే
- హెడ్-అప్ డిస్ప్లే (HUD)
- 360-డిగ్రీల కెమెరా
- వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- క్రూయిజ్ కంట్రోల్
- పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
- మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్
ఇంజన్ ఆప్షన్లు :
కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ 1.0-లీటర్, 3-సిలిండర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. 110hp, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ టర్బో-పెట్రోల్ ఇంజన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందిస్తుంది. కొత్త బ్రెజ్జా అదే 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ స్థానంలో ఇప్పుడు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందిస్తుంది.
