మారుతి సుజుకీ ఆఫర్ : కార్ల మోడల్స్ పై రూ.5వేలు తగ్గింపు

కార్ల ధరలు దిగొచ్చాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను తగ్గించింది. ఎంపిక చేసిన కారు మోడల్స్ ధరలపై (ఎక్స్-షోరూంతో కలిపి) రూ.5వేల వరకు ధర తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది.

  • Publish Date - September 25, 2019 / 07:09 AM IST

కార్ల ధరలు దిగొచ్చాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను తగ్గించింది. ఎంపిక చేసిన కారు మోడల్స్ ధరలపై (ఎక్స్-షోరూంతో కలిపి) రూ.5వేల వరకు ధర తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది.

కార్ల ధరలు దిగొచ్చాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను తగ్గించింది. ఎంపిక చేసిన కారు మోడల్స్ ధరలపై (ఎక్స్-షోరూంతో కలిపి) రూ.5వేల వరకు ధర తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. ధరలు తగ్గించే కారు మోడళ్లలోని వేరియంట్లను ఎంపిక చేసింది.

ఎంపిక చేసిన అన్ని వేరియంట్లలో ఆల్టో 800, ఆల్టో K10, స్విఫ్ట్ డీజిల్, సెలిరియో, బాలెనో డీజిల్, లెగ్నిస్, డిజైర్ డీజిల్, టూర్ ఎస్ డీజిల్, వితారా బ్రిజా, ఎస్-క్రాస్, ఎంఎస్ఐ వంటి మోడల్స్ ధరలను తగ్గించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కారు మోడల్స్ ధర స్థాయి రూ.2.93 లక్షల నుంచి రూ.11.49 లక్షల వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25, 2019 (బుధవారం) నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. కంపెనీ వెహికల్ రేంజ్ ను ప్రస్తుత ప్రమోషనల్ ఆఫర్ల పైన ధరలు తగ్గించినట్టు కంపెనీ పేర్కొంది. ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ కస్టమర్లకు కార్ల ధరల తగ్గింపు విధానం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడింది.

ఫెస్టివల్ సీజన్ కావడంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లలో డిమాండ్ తగినట్టుగా తమ కార్ల ధరలను తగ్గించినట్టు కంపెనీ స్పష్టం చేసింది. సేల్స్  మందగమనంతో డీలా పడిన ఆటో రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు గతవారమే ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఆటో పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఫలితంగా కొన్ని రోజుల తర్వాత మారుతీ సుజుకీ తమ కార్ల మోడల్స్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. 

ట్రెండింగ్ వార్తలు