Maruti Suzuki Cars : కొత్త కారు కావాలా? మారుతి కార్లపై ఏకంగా రూ.81వేలు డిస్కౌంట్.. మీ బడ్జెట్‌‌లో కొత్త కారు ఇంటికి తెచ్చుకోండి!

Maruti Suzuki Cars : మారుతి సుజుకీ కార్లపై ఉగాది సేల్స్ ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి ఈ మార్చిలో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కారు కొనుగోలుపై రూ. 81వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

Maruti Suzuki Presents Ugadi Utsavam

Maruti Suzuki Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మీ కారు డ్రీమ్ నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయం. ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఉగాదికి ముందే పండుగ సేల్స్ తీసుకువస్తోంది.

Read Also : iPhone 17 Series : వార్నీ.. ఐఫోన్ 17 సిరీస్ చూశారా? ఫీచర్లు అన్నీ లీక్.. కొత్త ఐఫోన్లలో ఆపిల్ తీసుకొచ్చే అప్‌గ్రేడ్స్ ఇవేనట..!

ఈ మార్చిలో ‘ఉగాది ఉత్సవం’ పేరుతో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. మీకు ఇష్టమైన మారుతి సుజుకి కార్లపై తిరుగులేని ఆఫర్లను అందిస్తోంది.

మీ డ్రీమ్ కారుపై మారుతి సుజుకీ ఏకంగా రూ. 81,100 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొత్తగా కారు కొనేవారికి ఈ అద్భుతమైన ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ ఉగాది ఉత్సవం ఆఫర్లకు సంబంధించి ఒక వీడియోను వరుణ్ మారుతి అధికారిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఆ వీడియోలో మారుతి సుజుకీ షోరూమ్ ముందు మారుతి డిజైర్ కారు ఒకటి వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒకరు షోరూంలోకి ఒక బుక్‌తో వెళ్తారు. బ్లూ కలర్ బుక్ కవర్‌పై కాన్ఫిడెన్షియల్ అని రాసి ఉంటుంది.

Read Also : Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ మార్చిలో హ్యుందాయ్ కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్..!

ఆ బుక్ లోపల ఇవ్వగానే అక్కడ ఒకరు అది ఓపెన్ చేసి చూస్తారు. అందులో మొదటగా ఈ మార్చి నెల అన్ని నెలల మాదిరిగా కాదని రాసి ఉంది. మీరు ఊహించిన దాని కన్నా పెద్దదే మీకోసం రాబోతుంది. ఉగాది ఉత్సవం సేల్స్ సందర్భంగా మీకు నచ్చిన మారుతి కారుపై ఏకంగా రూ. 81,100 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు అని ఉంది.

మీరు కారు కొనే ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కోసం బుక్ చేసుకోండి అంటూ మొబైల్ నెంబర్ (9100050937)తో పాటు అధికారిక వెబ్‌‌సైట్ (www.varunmaruti.com) లింక్ ద్వారా విజిట్ చేయొచ్చు.