iPhone 17 Series : వార్నీ.. ఐఫోన్ 17 సిరీస్ చూశారా? ఫీచర్లు అన్నీ లీక్.. కొత్త ఐఫోన్లలో ఆపిల్ తీసుకొచ్చే అప్‌గ్రేడ్స్ ఇవేనట..!

iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. డిజైన్, బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లే వంటి ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

iPhone 17 Series : వార్నీ.. ఐఫోన్ 17 సిరీస్ చూశారా? ఫీచర్లు అన్నీ లీక్.. కొత్త ఐఫోన్లలో ఆపిల్ తీసుకొచ్చే అప్‌గ్రేడ్స్ ఇవేనట..!

iPhone 17 Series

Updated On : March 12, 2025 / 12:51 PM IST

iPhone 17 Series Launch : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. 2025లో కొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ విషయంలో మరిన్ని లీకులు బయటకు వచ్చాయి. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఏయే ఫీచర్లతో లాంచ్ చేయనుందో అనేక లీక్‌లు రివీల్ చేశాయి.

లీకుల ప్రకారం.. ఐఫోన్ 17 లైనప్‌లో 4 మోడళ్లు సెప్టెంబర్ 2025లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్. డిజైన్, డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా బ్యాటరీ లైఫ్‌ అప్‌గ్రేడ్‌లతో లీక్‌ల నుంచి అన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.

Read Also : Google Pixel 9a : భలే ఉందిగా కొత్త పిక్సెల్ 9a ఫోన్.. లాంచ్‌కు ముందే వీడియో లీక్.. కెమెరా ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ఐఫోన్ 17, ప్రో, ఎయిర్, ప్రో మాక్స్ త్వరలో లాంచ్ :
డిజైన్ పరంగా పరిశీలిస్తే.. (USB-C) పోర్ట్, యాక్షన్ బటన్‌తో సహా మొత్తం ఆపిల్ స్టాండర్డ్ ఐఫోన్ 17ను ఐఫోన్ 16 మాదిరిగానే రిలీజ్ చేయనుందని భావిస్తున్నారు. అయితే, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రోతో సహా ప్రో మోడల్స్ బ్యాక్ సైడ్ కొత్త రెక్టాంగ్యులర్ కెమెరా బార్ డిజైన్‌ను కలిగి ఉండవచ్చు.

ఫోన్ వెడల్పును విస్తరించి రౌండ్ ఎడ్జ్ క్లీనర్ కలిగి ఉండవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 16 ప్రో కన్నా 2mm సన్నగా ఉండొచ్చు. ఆపిల్ ఐఫోన్ Se 4 లైనప్‌లో అత్యంత సన్నని మోడళ్లలో ఒకటి. రాబోయే ఐఫోన్ 17లో డ్యూయల్-కెమెరా సెటప్‌ అలానే ఉండొచ్చు.

ఆపిల్ డిస్‌ప్లేతో పాటు స్టాండర్డ్ ఐఫోన్ 17 స్క్రీన్ సైజును పెంచుతున్నట్లు కనిపిస్తోంది. 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 16లో ప్రస్తుత 6.1-అంగుళాల నుంచి అప్‌గ్రేడ్ అయి ఐఫోన్ 16 ప్రోకి దగ్గరగా ఉంటుంది. ఈ మార్పుతో వీడియోలు చూసేందుకు బిగ్ స్క్రీన్‌లను ఇష్టపడే యూజర్లను ఆకర్షిస్తుంది. అదనంగా, ఐఫోన్ 17 సిరీస్ అన్ని మోడళ్లలో ప్రోమోషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

బేస్ మోడల్స్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండవచ్చు. స్మూత్ స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్‌లో యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఐఫోన్ ప్లస్‌ను రిప్లేస్ చేస్తుందని పుకార్లు వస్తున్న ఐఫోన్ 17 ఎయిర్ 6.6-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు.

ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ ఆపిల్ కొత్త A19 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతాయని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే ప్రో మోడల్స్ మరింత పవర్‌ఫుల్ A19 ప్రో చిప్‌ను కలిగి ఉండవచ్చు. ఈ కొత్త జనరేషన్ చిప్‌లు స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఆపిల్ థర్మల్ మేనేజ్‌మెంట్ కూడా అందించనుందని పుకారు ఉంది. గేమింగ్, 4K వీడియో రికార్డింగ్ వంటి ఇంటెన్సివ్ ఫీచర్లు ఫోన్ హీట్ కాకుండా స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండవచ్చు.

ఒక్కో కెమెరాకు ఒక్కో ప్రత్యేకత :
కెమెరా అప్‌గ్రేడ్‌ల పరంగా పరిశీలిస్తే.. ఐఫోన్ 17 సిరీస్‌లో ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాలో భారీ మార్పులు ఉండొచ్చు. ఐఫోన్ 17లో 24ఎంపీ ఫ్రంట్ కెమెరాను తీసుకురావచ్చు. ప్రస్తుత 12ఎంపీ సెన్సార్ నుంచి సెల్ఫీల కోసం భారీ అప్‌గ్రేడ్ ఉండొచ్చు. బ్యాక్‌సైడ్ ఐఫోన్ 17 మోడల్ 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు.

అయితే, ఐఫోన్ ప్రో మోడళ్లకు ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. 5x టెలిఫోటో జూమ్‌ను కలిగి ఉండదు. మరోవైపు, ఐఫోన్ 17 ప్రో మాక్స్ వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో కెమెరాలతో అడ్వాన్స్‌డ్ 3-లెన్స్ సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. మెకానికల్ ఎపర్చరు ఉండొచ్చు. వివిధ లైటింగ్ కండిషన్లలో కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు :
ప్రస్తుతానికి బ్యాటరీ కెపాసిటీపై క్లారిటీ లేదు. కానీ డిస్‌ప్లే సైజు ఎక్కువగా ఉండవచ్చు. ఆపిల్ ఐఫోన్ 17 ఐఫోన్ 16 ప్రోతో పోలిస్తే భారీ బ్యాటరీతో రానున్నట్టు సూచిస్తుంది. 3,582mAh బ్యాటరీని కలిగి ఉంది. దాంతో మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌తో 35W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించే అవకాశం ఉందని లీక్‌లు సూచిస్తున్నాయి. గత మోడళ్ల కన్నా వేగంగా ఛార్జింగ్ టైమ్ అందిస్తుంది. ఎంత అప్‌గ్రేడ్ అయినప్పటికీ, స్పీడ్ ఛార్జింగ్ అందించే ఆండ్రాయిడ్ ఫోన్లలో కన్నా తక్కువనే చెప్పాలి.

Read Also : Google Pixel 9a : భలే ఉందిగా కొత్త పిక్సెల్ 9a ఫోన్.. లాంచ్‌కు ముందే వీడియో లీక్.. కెమెరా ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ఐఫోన్ 17 సిరీస్ భారీ అప్‌గ్రేడ్‌లను తీసుకువస్తుంది. ముఖ్యంగా డిస్‌ప్లే క్వాలిటీ, కెమెరా అప్‌గ్రేడ్స్, బిగ్ స్క్రీన్‌లు, స్పీడ్ చిప్‌సెట్‌లు, ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్‌లతో రానున్నట్టు లీక్‌లు వస్తున్నాయి. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్స్ ఐఫోన్ 16 సిరీస్‌కు అప్‌‌గ్రేడ్ వెర్షన్‌గా రానున్నాయి. లాంచ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు బయటకు రావచ్చు.