Hyundai Car Discounts : కొత్త కారు కొంటున్నారా? ఈ మార్చిలో హ్యుందాయ్ కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్..!
Hyundai Car Discounts : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పాపులర్ కార్లలో i20, ఎక్స్‌టర్, వెన్యూ, ఇతర కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Hyundai Car Discounts
Hyundai Car Discounts : కొత్త కారు కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో కార్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) భారీ ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ కస్టమర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘హ్యుందాయ్ సూపర్ డిలైట్ మార్చ్’ అనే అమ్మకాల ప్రమోషన్ క్యాంపెయిన్ ప్రకటించింది.
హెచ్ఎంఐఎల్ వాహనాల రేంజ్‌పై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు 2025 మార్చి 1 నుంచి మార్చి 31 మధ్య కొనుగోలు చేసిన హ్యుందాయ్ కార్లలో ఎంపిక చేసిన వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హోల్-టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీతరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. “ఈ మార్చిలో కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు, రివార్డులను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యుందాయ్ కారు కొనేవారికి మరింత ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం.
అద్భుతమైన ఫీచర్లతో ఆకర్షణీయమైన కార్లను అందించడం ద్వారా కస్టమర్ అంచనాలను అధిగమించగలమని భావిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్లు, స్పెషల్ రివార్డుల ద్వారా హ్యుందాయ్‌ను కొనుగోలు చేసేలా చేయడమే మా లక్ష్యం. కస్టమర్‌లు తమకు ఇష్టమైన హ్యుందాయ్ కారును ఇంటికి తీసుకెళ్లేలా ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తున్నాం. ” అని పేర్కొన్నారు.
హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ వెన్యూ మొత్తం 3 ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.2-లీటర్ NA పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఇంజన్లు వరుసగా 83HP, 116HP, 120 HP గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలవు. హ్యుందాయ్ ఎంపిక చేసిన వేరియంట్లపై వెన్యూపై రూ. 55వేల విలువైన డిస్కౌంట్లను అందిస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ :
హ్యుందాయ్ ఎక్స్‌టర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, సీఎన్‌జీ ఇంజిన్‌తో కూడిన 1.2-లీటర్ పెట్రోల్ వరుసగా 83HP, 69HP పవర్ జనరేట్ చేయగలదు. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై రూ. 35వేల విలువైన డిస్కౌంట్లను అందిస్తోంది.
హ్యుందాయ్ i20 :
హ్యుందాయ్ i10 కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. వరుసగా 83HP, 114.7Nm గరిష్ట శక్తి, టార్క్ అవుట్‌పుట్‌ను అందించగలదు. మార్చి 2025 ఆఫర్ల కింద హ్యుందాయ్ i20 రూ. 50వేల తగ్గింపుతో వస్తుంది.
హ్యుందాయ్ ఐ10 NIOS :
హ్యుందాయ్ i10 నియోస్ రెండు ఇంజన్ వేరియంట్లతో వస్తుంది. అందులో ఒకటి ఆప్షనల్. 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ బై-ఫ్యూయల్ ఇంజన్.. ఈ రెండు వరుసగా 83HP, 69HP పవర్ అందిస్తాయి. హ్యుందాయ్ i10 NIOS కారుపై రూ.53వేలు విలువైన డిస్కౌంట్ అందిస్తోంది.