×
Ad

Maruti Suzuki Victoris : ఈ మారుతి కారుకు ఎందుకింత క్రేజ్? 5 నెలల్లోనే 50,000 మంది కొనేశారు, ఫీచర్లు పిచ్చెక్కిస్తున్నాయ్..!

Maruti Suzuki Victoris : మారుతి సుజుకి విక్టోరిస్ లాంచ్ అయిన 5 నెలల్లోనే 50వేల కార్లు కొనేశారు. ఈ SUV కారు జనవరి 2026లో అమ్మకాలలో కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి కార్లను అధిగమించింది. 

Maruti Suzuki Victoris ( Image Credit to Original Source )

  • మారుతి కారు మార్కెట్‌ షేక్, 5 నెలల్లోనే 50,000 యూనిట్లు సేల్
  • ఈ మారుతి విక్టోరిస్ కు మార్కెట్లో భారీగా పెరిగిన క్రేజ్, ధర, ఫీచర్లే హైలైట్
  • జనవరి 2026 అమ్మకాల్లో కియా సెల్టోస్, టాటా సియెర్రా కార్లను దాటేసింది

Maruti Suzuki Victoris Sales : మారుతి కారు లవర్స్ కోసం అదిరిపోయే న్యూస్.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే అనేక మోడల్ కార్లు హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి.

కొన్ని నెలల క్రితమే మారుతి సుజుకి మిడ్-సైజ్ SUV కేటగిరీలో మారుతి సుజుకి విక్టోరిస్ కొత్త కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ మారుతి విక్టోరిస్ ఇప్పుడు 50వేల అమ్మకాలను అధిగమించింది. మీరు కూడా మారుతి కారు ప్రియులు అయితే ఇది మీకోసమే.. ఫీచర్ల కోసమైన మారుతి విక్టోరిస్ ఇంటికి తెచ్చుకోవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

మారుతి సుజుకి విక్టోరిస్ సేల్స్ :
మారుతి సుజుకి విక్టోరిస్ లాంచ్ అయిన 5 నెలల్లోనే 50,000 అమ్మకాల మార్కును దాటేసింది. సెప్టెంబర్ 2025లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ SUV కారు జనవరి 2026లో అమ్మకాలలో కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి పాపులర్ కార్లను అధిగమించింది.

Maruti Suzuki Victoris ( Image Credit to Original Source )

విక్టోరిస్ అమ్మకాలు సెప్టెంబర్ 2025లో 4,261 యూనిట్లతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత డిమాండ్ ప్రతి నెలా క్రమంగా పెరుగుతూ వచ్చింది. జనవరి 2026 నాటికి 15,240 యూనిట్లకు చేరుకుంది. మొత్తంమీద, ప్రారంభమైన 5 నెలల్లో దేశీయ అమ్మకాలు 51,507 యూనిట్లుగా ఉన్నాయి.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. 8వ వేతన సంఘం కొత్త వెబ్‌సైట్.. మార్చి 16 వరకు డెడ్ లైన్.. మీ సూచనలు ఇవ్వండి!

జనవరి 2026లో విక్టోరిస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఇంకా, అమ్మకాలలో గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియెర్రాలను అధిగమించింది.

మారుతి సుజుకి విక్టోరిస్ ధర :
మారుతి సుజుకి విక్టోరిస్ ధర విషయానికి వస్తే.. మారుతి సుజుకి విక్టోరిస్ రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 19.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి లభిస్తుంది.

మారుతి సుజుకి విక్టోరిస్ ఫీచర్లు :
మారుతి సుజుకి విక్టోరిస్ అద్భుతమైన మోడ్రాన్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, అలెక్సా ఆటో, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లలో లెవల్-2 అడాస్, 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్-ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ ఉన్నాయి. ఈ SUV భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది.