Maruti Suzuki Victoris
Maruti Suzuki Victoris : మారుతి సుజుకి ఇటీవలే కాంపాక్ట్ SUV విక్టోరిస్ కారును లాంచ్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ కారు అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. కేవలం రెండున్నర నెలల్లోనే 30వేల అమ్మకాలతో రికార్డు సృష్టించింది.
సెప్టెంబర్‌లో వచ్చిన ఈ SUV కారు ప్రారంభ డెలివరీలను నెలవారీ అమ్మకాలుగా మార్చేసింది. ఈ క్రమంలో విక్టోరిస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారాను అధిగమించింది. ఈ కారు అమ్మకాలకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
సెప్టెంబర్ 2025లో లాంచ్ అయినప్పటినుంచి మారుతి సుజుకి విక్టోరిస్ 4,261 యూనిట్లను అమ్మింది. అక్టోబర్ ప్రారంభం నాటికి విక్టోరిస్ బుకింగ్‌లు 25వేలు యూనిట్లను దాటాయి. నవరాత్రి వంటి పండుగ సీజన్లలో డెలివరీలు వేగం పుంజుకున్నాయి.
గ్రాండ్ విటారాను అధిగమించిన విక్టోరియాస్ :
2025 అక్టోబర్ నెల విక్టోరిస్‌కు బాగా కలిసొచ్చింది. అక్టోబర్ నెలలో విక్టోరిస్ 13,496 యూనిట్ల రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. పోటీదారులను అధిగమించడమే కాకుండా నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే మారుతి పాపులర్ కారు గ్రాండ్ విటారాను కూడా అధిగమించింది.
విక్టోరిస్ గ్రాండ్ విటారాను 3వేల యూనిట్లకు పైగా తేడాతో అధిగమించింది. విక్టోరిస్ మారుతి సుజుకి అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతుండగా, గ్రాండ్ విటారా నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతోంది. నవంబర్‌లో 12300 యూనిట్ల విక్టోరిస్ అమ్ముడయ్యాయి. మొత్తం అమ్మకాల సంఖ్య 30వేలకు పైగా ఉంది.
ఇంజిన్ ఆప్షన్లు :
కస్టమర్ అవసరాలకు అనుగుణంగా విక్టోరిస్ మల్టీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందిస్తుంది. పెట్రోల్, CNG స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లలో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 28.65kmpl ఆకట్టుకునే మైలేజీని అందిస్తుంది.
కస్టమర్లలో బాగా పాపులర్ పొందింది. అయితే, సీఎన్‌జీ వేరియంట్ అత్యంత దృష్టిని ఆకర్షించింది. విక్టోరిస్ సీఎన్‌జీ వేరియంట్ అండర్ బాడీ ట్యాంక్‌తో వస్తుంది. అంటే.. సీఎన్‌జీ ట్యాంక్ ట్రెడేషనల్ వాహనాలలో మాదిరిగా ట్రంక్‌లో కాకుండా కారు కింద ఎక్కువ సామాను స్టోరేజీ పొందవచ్చు.
సేఫ్టీ, ధర ఎంతంటే? :
మారుతి సుజుకి విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇండియా NCAP, గ్లోబల్ NCAP రెండింటి నుంచి 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది.