Mercedes-Benz Cars : లగ్జరీ కార్ల మార్కెట్లో బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న ఆడి, బెంజ్ కార్ల ధరలు

Mercedes-Benz Cars : భారత మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మెర్సిడెస్-బెంజ్ ఏప్రిల్ 1, 2026 నుంచి మొత్తం వాహన పోర్ట్‌ఫోలియోలో దాదాపు 2 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది.

Mercedes-Benz Cars

  • భారీగా పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి
  • కరెన్సీ మార్పులు, పెరుగుతున్న ఖర్చులే కారణం
  • 2 శాతం ధరలు పెంచనున్న ఆడి ఇండియా

Mercedes-Benz Cars : లగ్జరీ కారు కొనేవారికి బిగ్ షాక్.. మీరు లగ్జరీ కార్ల ప్రియులైతే ఇది మీకోసేమే.. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరల పెంపును ప్రకటించింది.

అతి త్వరలో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మెర్సిడెస్ బెంజ్ తన పోర్ట్‌ఫోలియోలో ఏప్రిల్ 1, 2026 నుంచి ధరలు సుమారు 2 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది.  కరెన్సీలో మార్పులు, రూపాయి బలహీనపడటం, పెరుగుతున్న ఖర్చులే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

పెరిగిన మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు :
రూపాయితో పోలిస్తే యూరో బలపడటం వల్ల కంపెనీ ఖర్చులు భారీగా పెరిగాయని మెర్సిడెస్-బెంజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ సిస్సింగ్ తెలిపారు. ముడి పదార్థాలు, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు కూడా పెరిగాయి. దాంతో కంపెనీ ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

Read Also : Samsung Galaxy S24 : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 32వేలు తగ్గింపు.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు

భారత మార్కెట్లో విక్రయించే అన్ని కార్లపై మెర్సిడెస్-బెంజ్ కొత్త ధరలు వర్తిస్తాయి. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. కస్టమర్లకు ప్రీమియం ప్రొడక్టులు, అత్యుత్తమ సర్వీసు ఎక్స్ పీరియన్స్ అందించే దిశగా దృష్టి సారిస్తూనే ఉంటామని మెర్సిడెస్-బెంజ్ పేర్కొంది.

ఆడి కార్ల ధరలు కూడా పెంపు :
మెర్సిడెస్-బెంజ్ తర్వాత జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి కూడా కార్ల ధరలను పెంచనుంది. ఆడి ఇండియా కార్ల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి  ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.