×
Ad

Mercedes-Benz : సూపర్ లగ్జరీ ఫ్యామిలీ కారు : మెర్సిడెస్-బెంజ్ V-క్లాస్ రీఎంట్రీ.. రూ.1.40 కోట్ల రేంజ్‌లో రాయల్ MPV

Mercedes-Benz V-Class Luxury MPV : మెర్సిడెస్ బెంజ్ కారు కొనేవారికి గుడ్ న్యూస్.. దేశీయ మార్కెట్లో వి-క్లాస్ లగ్జరీ MPV కారు రీఎంట్రీ ఇచ్చింది. మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ ధరలు రూ. 1.40 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

Mercedes-Benz

Mercedes-Benz V-Class Luxury MPV : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మెర్సిడెస్-బెంజ్ ఇండియా దేశీయ మార్కెట్లో V-క్లాస్ లగ్జరీ MPVని తిరిగి ప్రవేశపెట్టింది. ఈ కారు ధరలు ధరలు రూ. 1.40 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

4 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ మోడల్, ప్రీమియం ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎమ్‌లతో పోటీ పడనుంది. ముఖ్యంగా, V-క్లాస్ ఇప్పుడు భారత మార్కెట్లోనే తయారవుతుంది. మెర్సిడెస్-బెంజ్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరిస్తోంది.

ఎక్స్‌ట్రనల్ డిజైన్, లుక్ :
2023లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన కొత్త V-క్లాస్ ఇప్పుడు అనేక డిజైన్ అప్‌డేట్‌లతో భారత మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్, పాత మోడళ్ల మాదిరిగా స్టైలింగ్ ఆప్షన్లతో వస్తుంది.

ఈ బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్, పాత మోడళ్లలో స్టైలింగ్ కూడా ఉంది. 3,200mm వీల్‌బేస్‌పై వస్తుంది. భారత మార్కెట్లో లాంగ్ 3,430mm వీల్‌బేస్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగత మోడళ్లలో కన్నా మెర్సిడెస్ కారు చాలా పొడవు ఉంటుంది.

Read Also : Apple iPhone 16e : ఆపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17e ఎంట్రీతో భారీగా పడిపోయిన iPhone 16e ధర, ఎంతంటే?

AMG లైన్ స్టైలింగ్ చాలా స్టాండర్డ్. ఇందులో స్టార్-స్టడెడ్ గ్రిల్, స్పోర్టీ బంపర్, డీఆర్ఎల్ మల్టీ-బీమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఎంపీవీ డ్యూయల్-టోన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అయితే, భారీ 19-అంగుళాల వీల్స్ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంటీరియర్, ఫీచర్లు :
వెనుక సీటులో ప్రయాణీకుల కోసం ఎంపీవీ క్యాబిన్ చాలా కంపర్ట్ ఉంటుంది. కొనుగోలుదారులు 4, 6 సీట్ల లేఅవుట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. లాంజ్ సీట్లు పవర్ ద్వారా అడ్జెస్ట్ చేయొచ్చు. రిక్లైన్, మసాజ్, వెంటిలేషన్ అందిస్తాయి.

6 సీట్ల కాన్ఫిగరేషన్‌లో, 3వ వరుసలో వెంటిలేషన్ కూడా ఉంటుంది. ఇతర ఫీచర్లలో 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, రెండు 12.3-అంగుళాల డాష్‌బోర్డ్ స్క్రీన్‌లు, 2 ఇంటీరియర్ థీమ్‌లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లలో 7 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ సూట్ ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్లు :
మెర్సిడెస్-బెంజ్ రెండు వేరియంట్లలో వస్తుంది. V300 d డీజిల్, V300 పెట్రోల్ ఉన్నాయి. డీజిల్ వెర్షన్ 2-లీటర్, 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో 237hpని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ 231hpని ఉత్పత్తి చేసే 2-లీటర్ ఇంజిన్‌ కూడా ఉంది. మైల్డ్-హైబ్రిడ్ అసిస్టెన్స్ ఉంది. ఈ రెండు ఇంజన్లు 9-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రన్ అవుతాయి.