Mobile Tariff Hike: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలు

దేశంలోని మొబైల్(Mobile Tariff Hike) వినియోగదారులకు టెలికాం కంపెనీలు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Mobile recharge prices set to rise huge soon. (1)

  • రీఛార్జ్ ధరలు పెరగనున్నాయి
  • మొబైల్ బిల్లులు భారమౌతాయి
  • టెలికాం కంపెనీల భారీ ప్లాన్

Mobile Tariff Hike: దేశంలోని మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈ మొబైల్ టారిఫ్ పెంపు అదనపు భారంగా మారనుంది. రానున్న 3 నుంచి 4 నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 12-15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరణ కోసం టెలికాం సంస్థలు భారీగా చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో పోటీ తగ్గడం కూడా కంపెనీలకు అనుకూలంగా మారింది.

Mahabubnagar Jail: ఓరి వీడి దుంపతెగ.. ప్రియురాలి కోసం ఏకంగా జైలు గోడ దూకేశాడు.. చివరికి ఎం జరిగిందో తెలుసా?

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో(Mobile Tariff Hike), భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, ప్రతి నెలా లక్షలాది మంది కొత్త చందాదారులను ఆకర్షిస్తున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన జియోకు సగటున 70 లక్షల మంది, ఎయిర్‌టెల్‌కు 50 లక్షల మంది కొత్త యూజర్లు తోడవుతుండగా, వొడాఫోన్ ఐడియా మాత్రం కేవలం 2 లక్షల మందితో వెనుకబడి ఉంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ సంస్థలు దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో తమ 5జీ సేవలను విస్తరించగా, వొడాఫోన్ ఐడియా కూడా దాదాపు 100 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది.

వినియోగదారులు వేగంగా 2జీ నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు మారుతుండటం, అలాగే పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో టెలికాం కంపెనీల సగటు ఆదాయం (ARPU) కూడా మెరుగుపడనుంది. జూన్ త్రైమాసికంలో ఈ ఆదాయం 1 నుంచి 1.5 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 4జీ, 5జీ డేటా వినియోగం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కంపెనీలు టారిఫ్ ధరలను పెంచాలని చూస్తుండటం, మొబైల్ బిల్లుల బడ్జెట్‌ను మరింత పెంచేలా కనిపిస్తోంది.