Petrol Price Hike: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ కు రూ.5 చొప్పున!

దేశంలో వాహనదారులకు ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలింగ్ సంస్థ 'నయారా ఎనర్జీ(Petrol Price Hike)' ఊహించని షాక్ ఇచ్చింది.

Nayara energy hikes petrol and diesel prices across 7000 fuel stations in india

Petrol Price Hike: దేశంలో వాహనదారులకు ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలింగ్ సంస్థ ‘నయారా ఎనర్జీ’ ఊహించని షాక్ ఇచ్చింది. ముడి చమురు సరఫరా వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో తమ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ రంగానికి చెందిన నయారా ఇంధన విక్రయ కేంద్రాల్లో శనివారం నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ సవరణతో నయారా పెట్రోల్ బంకుల వద్ద ఇంధనాన్ని నింపుకునే సామాన్య, మధ్యతరగతి వాహనదారులు, రవాణాదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

Ration Card Update: రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఆ పని చేయకపోతే కార్డు బ్లాక్.. వెంటనే ఇలా చేయండి!

శనివారం నుంచే అమలు.. ప్రైవేట్ vs ప్రభుత్వ బంకుల ధరలు:

సవరించిన ధరల ప్రకారం నయారా ఎనర్జీ లీటరు పెట్రోల్‌(Petrol Price Hike)పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.3 మేర పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా బంకుల్లో ఈ కొత్త ధరలు శనివారం నుంచి వర్తిస్తాయి. అయితే, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్న బంకుల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ధరల పెంపు లేకుండా పాత ధరలే కొనసాగుతుండటం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్ బంకుల మధ్య లీటరుకు ఈ స్థాయిలో వ్యత్యాసం రావడం వాహనదారుల్లో చర్చనీయాంశంగా మారింది.