SBI ATM Rules : ATM నుంచి డబ్బులు తీస్తున్నారా? SBI కొత్త ఛార్జీలు ఇవే
SBI ATM Rules : ఎస్బీఐ ఏటీఎం విత్‌డ్రా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఉచిత లావాదేవీల పరిమితి, అదనపు ట్రాన్సాక్షన్ల ఛార్జీలు, AePS సేవలకు సంబంధించిన మార్పుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- September 27, 2026 / 04:08 PM IST
SBI ATM Rules
- ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నెలలో ఉచిత ఏటీఎం లావాదేవీలు ఎన్నంటే?
- ఎస్బీఐ ఖాతాదారులు తెలుసుకోవాల్సిన కొత్త ఏటీఎం రూల్స్ ఇవే
- అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏటీఎం విత్ డ్రా రూల్స్ మారబోతున్నాయి
SBI ATM Rules : మీ ఎస్బీఐలో ఖాతా ఉందా? అయితే, మీకో బిగ్ అలర్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఏటీఎం రూల్స్ అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు తప్పక పాటించాలి. ఇందులో ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు ఈ కొత్త మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కొత్త రూల్స్ ప్రకారం.. ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో ఏటీఎం లావాదేవీలను అదనపు ఛార్జీ లేకుండా చేసుకోవచ్చు. ఈ ఉచిత పరిమితి దాటితే మాత్రం ప్రతి అదనపు లావాదేవీకి రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, డిజిటల్ మార్గాల్లో చేసే కొన్ని లావాదేవీలకు ప్రత్యేక ఛార్జీలు ఉండవని ఎస్బీఐ పేర్కొంది. మరోవైపు ఆధార్ ఆధారిత AePS లావాదేవీలను ఇకపై ప్రత్యేకంగా లెక్కించనున్నారు. గతంలో వీటిని డిజిటల్ ట్రాన్సాక్షన్లలో భాగంగా పరిగణించేవారు.
Read Also : Special TG TET Results : స్పెషల్ టెట్‌లో సత్తా చాటిన టీచర్లు.. నవంబర్‌లో మరో స్పెషల్ టెట్
శాలరీ ఖాతా ఉన్నవారికి మార్పులు :
శాలరీ అకౌంట్ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలతో ఉపయోగించినప్పుడు ఉచిత లావాదేవీల పరిమితి దాటితే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. నగదు తీసుకుంటే రూ.23 + జీఎస్టీ, ఇతర లావాదేవీలకు రూ.11 + జీఎస్టీ వసూలు చేసే విధానం ఉంటుంది.
సెప్టెంబర్ 28-30 వరకు స్పెషల్ రిలీఫ్ :
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఇతర బ్యాంకుల ఏటీఎంల వినియోగంపై అదనపు ఛార్జీలను మాఫీ చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
కస్టమర్లకు నగదు కొరత రాకుండా ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. అందుకే ఎస్బీఐ కస్టమర్లు ఏటీఎం ఉచిత పరిమితి, అదనపు ఛార్జీలు, కొత్త రూల్స్ గురించి ముందుగానే తెలుసుకోవడం బెటర్.
