New EPF Advance Rules : EPF అడ్వాన్స్ రూల్స్ మారాయి.. ఇక PF డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే?

New EPF Advance Rules : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. అడ్వాన్స్ రూల్స్ మారిపోయాయి. ఇకపై పీఎఫ్ అడ్వాన్స్ డబ్బులు ఎప్పుడైనా ఈజీగా తీసుకోవచ్చు.. ఇంతకీ ఎన్నిసార్లు తీసుకోవచ్చంటే?

New EPF Advance Rules

  • ఈపీఎఫ్ఓ కొత్త అడ్వాన్స్ రూల్స్ ఏంటి?
  • అనారోగ్యం, చదువు, పెళ్లి, ఇల్లు కోసం అడ్వాన్స్
  • పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు సింపుల్.. ఎన్నిసార్లు తీసుకోవచ్చు?

New EPF Advance Rules : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ డబ్బుల విషయంలో ఆందోళన అక్కర్లేదు.. మీ పీఎఫ్ డబ్బులను ఎలా ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? ఈపీఎఫ్ కొత్త అడ్వాన్స్ రూల్స్ మారాయి. పీఎఫ్ అడ్వాన్స్ నిబంధనలు మరింత ఈజీగా మారాయి.

ఇక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కాదు.. చదువు, పెళ్లి, ఇల్లు కొనడం, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి రిపేర్ వంటి అవసరాలకు కూడా ఈపీఎఫ్ అడ్వాన్స్ డబ్బులు వాడుకోవచ్చు. కొత్త విధానంలో ఈపీఎఫ్ అడ్వాన్స్ రూల్స్‌ను ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంతకీ అవేంటో ఓసారి లుక్కేయండి..

ఫస్ట్ కేటగిరీ అనేది ఎమర్జెన్సీ అవసరాలకు పీఎఫ్ డబ్బులు పనికివస్తాయి. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉంటే ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందవచ్చు. ఈ కేటగిరీలో అనారోగ్యం కోసం అడ్వాన్స్ తీసుకునే సంఖ్యపై ప్రత్యేక పరిమితి లేదు.

Read Also : iPhone 16 Discount : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18 ప్రో రాక ముందే ఐఫోన్ 16 భారీగా తగ్గిందోచ్.. ఇదే బెస్ట్ టైమ్!

పిల్లల చదువు లేదా ఇతర విద్యా అవసరాల కోసం సభ్యత్వ కాలంలో గరిష్టంగా 10 సార్లు అడ్వాన్స్ తీసుకోవచ్చు. అలాగే ఉద్యోగి వివాహం లేదా అర్హత ఉన్న కుటుంబ సభ్యుల వివాహం కోసం 5 సార్లు వరకు డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉంది.

రెండో కేటగిరీ విషయానికి వస్తే.. ఇల్లు, హౌసింగ్ అవసరాలకు సంబంధించి డబ్బులు తీసుకోవచ్చు. ఫ్లాట్ లేదా స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి రిపేరింగ్, మార్పులు కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ కేటగిరీలో సభ్యత్వ కాలంలో గరిష్టంగా 5 సార్లు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది.

మూడో కేటగిరీ ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ప్రత్యేకంగా ప్రకటించే సందర్భాల్లో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 సార్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వాస్తవానికి, ఉద్యోగి, ఎంప్లాయిర్ షేర్ కలిపి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75శాతం వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు.

ఇందుకు 12 నెలల ఈపీఎఫ్ సభ్యత్వం పూర్తి అయి ఉండాలి. మొత్తంగా చూస్తే కొత్త రూల్స్ ద్వారా అవసరమైన సమయంలో ఈపీఎఫ్ డబ్బును ఎలా, ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనేది ఫుల్ క్లారిటీ వచ్చినట్టే..