New Labour Code : వారానికి ఇక 4 రోజులు పని మాత్రమే! కొత్త లేబర్ రూల్స్‌లో షాకింగ్ ట్విస్ట్!
New Labour Code : కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం.. ఇకపై వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కానీ, షరతులు వర్తిస్తాయి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- May 13, 2026 / 06:32 PM IST
New Labour Code ( Illustration generated using AI )
- వారానికి 4 రోజులు పని.. మిగతా 3 రోజులు ఫ్రీ? అసలు నిజం ఇదే!
- 4 రోజుల పని వారానికి గ్రీన్ సిగ్నల్.. కంపెనీలు కోరుకుంటే మాత్రమే
- ఉద్యోగులు 4 రోజులు రోజుకు 12 గంటలు వర్క్ చేయాలి
- ప్రతి కంపెనీకి ఇది వర్తించదు.. కంపెనీ, ఉద్యోగి ఇద్దరి అంగీకారం మస్ట్
New Labour Code : కొత్త కార్మిక చట్టం అమల్లోకి వచ్చేసింది. చట్టం ప్రకారం.. 48 గంటల పని వారాన్ని నోటిఫై చేశారు. జీతం, గ్రాట్యుటీ నిబంధనలను కూడా వివరించారు. రాష్ట్రాలు కూడా ఈ నిబంధనలను అమలు చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 29 ప్రస్తుత కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త లేబర్ (New Labour Code ) కోడ్‌లను అమలు చేసింది. ఈ 4 కార్మిక కోడ్‌లు వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, పనికి సంబంధించిన భద్రత, పని సంస్కృతి వంటి అంశాలు ఉంటాయి. ఈ కీలక నిబంధనలలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం..
దేశీయ కొత్త లేబర్ కోడ్ నిబంధనలను పరిశీలిస్తే.. 4 రోజుల పని వారం (48 గంటలు) అనే ఆప్షన్ కంపెనీలు కోరుకుంటే మాత్రమే అమలు చేసేందుకు వీలుంటుంది. వాస్తవానికి తప్పనిసరి నిబంధనేమి కాదు. ప్రతి కంపెనీకి ఇది వర్తించదు. కంపెనీ, ఉద్యోగి ఇద్దరి అంగీకారంతోనే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
48 గంటల నియమం :
ఈ పని విధానం ప్రకారం.. వారానికి మొత్తం వర్కింగ్ అవర్స్ 48 గంటలకు మించకూడదు. ఉద్యోగులు 4 రోజులు రోజుకు 12 గంటలు వర్క్ చేయాలి. ఈ 12 గంటల్లో కూడా లీగల్ బ్రేక్ టైమింగ్స్ కూడా ఉంటాయి. పని గంటలు పెరిగినా కూడా వీక్ లిమిట్ మాత్రం 48 గంటలు మించకూడదు.
ముఖ్యమైన షరతులేంటి? :
ఈ పనివారమనే నిబంధన అమలుకు కొన్ని షరతులు తప్పనిసరి. అందులో మొదటిది.. ఉద్యోగి అంగీకారం తప్పనిసరి. రెండోది కంపెనీకి అమలుకు ఇంటర్నల్ పాలసీ కూడా ఉండాలి. మూడోది పని స్వభావం చాలా అనుకూలంగా ఉండాలి. అదనంగా, 48 గంటలు మించి పనిచేస్తే అదనపు గంటలకు రెట్టింపు వేతనం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఏ రంగాలకు మంచిది? వేటికి కాదంటే? :
ఐటీఈఎస్, ఐటీ, డిజైన్, మార్కెటింగ్ వంటి ఆధారిత రంగాలకు ఈ పనివిధానం బెస్ట్. కానీ, హెల్త్ సెక్టార్, రవాణా, రిటైల్, తయారీ వంటి నిరంతర సేవలు అవసరమయ్యే రంగాల్లో 12 గంటల షిఫ్ట్‌లు అమలు చాలా కష్టంగా మారుతుంది.
ఆరోగ్యం, జీవితంపై ప్రభావం :
నిపుణుల ప్రకారం.. ఈ కొత్త పని విధానం సరిగ్గా అమలు చేస్తే ఉద్యోగులకు 3 రోజుల సెలవు లభిస్తుంది. దాంతో ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపగలరు. ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రయాణ ఒత్తిడి కూడా తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడటం వంటి బెనిఫిట్స్ ఉంటాయి. అదే తప్పుగా అమలైతే మాత్రం లాంగ్ టైమ్ వర్కింగ్ అవర్స్ అలసటకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా ఉద్యోగులకు ఎక్కువ రెస్ట్ దొరుకుతుంది. కానీ, పూర్తిగా షరతులు వర్తిస్తాయి. సరైన అమలుతో పాటు పరస్పర అంగీకారం ఉండాలి. పనితీరు అన్ని కలిస్తేనే ఈ కొత్త పని విధానంతో అసలైన బెనిఫిట్స్ పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
