New Labour Codes : బిగ్ అప్‌డేట్.. 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి.. 48 గంటల వర్క్ వీక్, శాలరీ, ఓవర్‌టైమ్ రూల్స్‌లో భారీ మార్పు!

New Labour Codes : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో 4 కొత్త కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఈ నిబంధనలు ఇకపై ప్రతి ఉద్యోగికి కనీస వేతనాలు, సామాజిక భద్రత, మెరుగైన పని వాతావరణాన్ని కల్పిస్తాయి.

New Labour Codes

  • లేబర్ లా రివల్యూషన్.. 4 కొత్త కార్మిక చట్టాలు అమలు
  • 48 గంటల పని ఫార్ములా, కొత్త ఓవర్‌టైమ్ రూల్స్
  • ఎక్కువసేపు పనిచేస్తే వారికి పూర్తి ఓవర్‌టైమ్ వేతనం
  • వారానికి కనీసం ఒక రోజు వీక్లీ ఆఫ్ తప్పనిసరి
  • చేతికి అందే నెలవారీ వేతనం కొద్దిగా తగ్గే అవకాశం

New Labour Codes : ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. దేశ కార్మిక వ్యవస్థలో కీలక మార్పు.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక చట్టాలను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలను అమలుకు అవసరమైన అన్ని నిబంధనలను అధికారిక గెజెట్‌లో చేర్చింది. దీంతో, ఈ కార్మిక చట్టాలు ఇప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చాయి.

వేతన చట్టం 2019, పారిశ్రామిక సంబంధాల చట్టం 2020, సామాజిక భద్రతా చట్టం 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం పని పరిస్థితుల చట్టం 2020 (New Labour Codes) నవంబర్ 21, 2025నే అమల్లోకి వచ్చాయి. అయితే, వివరణాత్మక నియమాలు లేకపోవడం వల్ల పూర్తి అమలు నిలిచిపోయింది.

వాటాదారుల సంప్రదింపుల తర్వాత ఇప్పుడు ఆ నియమాలను ఖరారు చేసి నోటిఫై చేశారు. దేశంలోని 29 పాత కార్మిక చట్టాలను కొత్త చట్టాల్లో విలీనం చేశారు. అయినప్పటికీ పూర్తిస్థాయి క్షేత్రస్థాయి అమలు కోసం రాష్ట్రాలు కూడా తమ నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది.

29 పాత చట్టాలు రద్దు :
పాత కార్మిక చట్టాలు కాలక్రమేణా భారంగా మారి కంపెనీలు, ఉద్యోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కార్మిక చట్టం ఈ మొత్తం వ్యవస్థను సరళీకరించి, పారదర్శకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రతి ఉద్యోగికి మెరుగైన రక్షణ కల్పించేందుకు ఈ మార్పులను చేసింది.

వారానికి 48 గంటల పని, ఓవర్‌టైమ్‌కు కొత్త నిబంధన :
కొత్త నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగికైనా వారానికి గరిష్టంగా 48 గంటల పని తప్పనిసరి. ఇకపై పని గంటలు పరిమితం. ఉద్యోగులపై అధిక భారం పడదు. ఒకవేళ ఉద్యోగి నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువసేపు పనిచేస్తే వారికి పూర్తి ఓవర్‌టైమ్ వేతనం చెల్లించాలి. అంతేకాదు.. ఉద్యోగులకు వారానికి కనీసం ఒక రోజు (వీక్లీ ఆఫ్) ఇవ్వడం తప్పనిసరి.

ప్రతి ఉద్యోగికి జాబ్ ఆఫర్ లెటర్, ఫ్రీ హెల్త్ టెస్ట్ మస్ట్ :
కొత్త కార్మిక చట్టంలోని కీలక మార్పు ఏమిటంటే.. ఇకపై ప్రతి ఉద్యోగిని నియమించుకున్నప్పుడు వారికి లిఖితపూర్వక నియామక పత్రం ఇవ్వడం తప్పనిసరి. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడుతుంది. అదనంగా, 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగుల కోసం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించవచ్చు.

మహిళలకు సమాన వేతనం అవకాశాలు :
ఈ కొత్త నిబంధనలు మహిళలకు కూడా ముఖ్యమైన సదుపాయాలను కల్పిస్తుంది. సమాన పనికి సమాన వేతనం, సమాన అవకాశాలు ఇకపై కల్పించనుంది. అంతేకాదు.. వేర్వేరు షిఫ్టులలో పనిచేసే మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయి.

Read Also : PF ATM UPI Withdrawal : EPFO బంపర్ న్యూస్.. ఈ నెల నుంచే PF డబ్బులు చేతికి.. ATM, UPI ద్వారా డైరెక్ట్ విత్‌డ్రా!

ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి? :
ప్రభుత్వం ఒక కొత్త జాతీయ నైపుణ్య పునరుద్ధరణ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ఏ కారణం చేతనైనా ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు పునఃశిక్షణ ఇచ్చి తద్వారా వారికి కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నిధిని వినియోగిస్తుంది.

కార్మికుల భద్రత, భవిష్యత్తు దిశగా చర్యలు :
కొత్త కార్మిక చట్టం భారత కార్మిక వ్యవస్థలో కీలక సంస్కరణగా చెప్పవచ్చు. ఉద్యోగులకు రక్షణ, ప్రయోజనాలతో పాటు కంపెనీలకు నిబంధనలను కూడా సులభతరం చేస్తుంది. ఈ మార్పులు దేశంలో కార్మిక అనుకూల, వృద్ధి అనుకూల వాతావరణాన్ని సృష్టించి ఉపాధి, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ పెంపొందిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

మీ జీతంపై ప్రభావం ఉంటుందా? :
కొత్త కార్మిక చట్టాలతో మీ జీతంపై నేరుగా తక్షణమే భారీ మార్పు కనిపించకపోవచ్చు. కానీ, జీతం నిర్మాణాన్ని మాత్రం మార్చుతుంది. ముఖ్యంగా వేతనాల కోడ్ 2019 ప్రకారం జీతాన్ని ఎలా లెక్కించాలి అనే విధానం మారుతోంది. కంపెనీలు ఉద్యోగుల జీతాలను కొత్త విధంగా మార్చాల్సి వస్తుంది.

ఇందులో కీలక విషయం ఏమిటంటే..50శాతం బేసిక్ శాలరీ నిబంధన.. అంటే ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 50శాతం బేసిక్ వేతనం + డియర్‌నెస్ అలవెన్స్ (DA)గా ఉండాలి. మిగతాది అలవెన్సులు వంటివి ఉంటాయి.

  • మొత్తం జీతం (CTC) అదే ఉండొచ్చు
  • కానీ, జీతం నిర్మాణం మారుతుంది
  • బేసిక్ శాలరీ పెరిగితే PF, గ్రాట్యుటీ కటింగ్స్ కూడా పెరుగుతాయి
  • ప్రతి నెల చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గే అవకాశం ఉంది
  • అయితే దీర్ఘకాలంలో పీఎఫ్, రిటైర్మెంట్ సేవింగ్స్ ఎక్కువ పెరుగుతాయి

ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు చేతిలో వచ్చే జీతం కొంచెం తగ్గవచ్చు. కానీ, భవిష్యత్తు సేవింగ్స్ (పీఎఫ్, గ్రాట్యుటీ) పెరుగుతుంది అనమాట.