Renault Duster 2026 : ఈ కారుకు మార్కెట్లో ఫుల్ క్రేజ్.. కొత్త రెనాల్ట్ డస్టర్ కోసం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? నెలకు EMI లెక్కలివే..!

New Renault Duster 2026 : కొత్త రెనాల్ట్ డస్టర్‌ను ఈఎంఐలో కొనాలని చూస్తున్నారా? ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? ఈఎంఐ ఎంత చెల్లించాలో తెలుసా? పూర్తి వివరాలివే..

New Renault Duster 2026

  • కొత్త రెనాల్డ్ డస్టర్ 2026 కొంటున్నారా?
  • ఈ కారు కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి?
  • నెలకు ఈఎంఐ ఎంతవరకు చెల్లించాల్సి ఉంటుంది?
  • అసలు ధర ఎంత ఉంది? ఫైనాన్స్ చేస్తే ఎంతకు వస్తుంది?

New Renault Duster 2026 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇటీవలే కొత్త SUV రెనాల్ట్ డస్టర్ 2026 భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కొత్త రెనాల్ట్ డస్టర్ ఇప్పటికే ఉన్న రెనాల్ట్ డస్టర్ థర్డ్ జనరేషన్ మోడల్.

కంపెనీ ఇప్పుడు కొత్త అప్‌డేట్‌లతో లాంచ్ చేసింది. కొత్త రెనాల్ట్ డస్టర్‌ను ఈఎంఐ కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇది మీకోసమే.. రెనాల్ట్ డస్టర్‌ను ఈఎంఐలో కొనేందుకు ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? నెలవారీగా ఈఎంఐ ఎంత చెల్లించాలో ఇప్పుడు పరిశీలిద్దాం..

కొత్త రెనాల్ట్ డస్టర్ ధర ఎంతంటే? :
కొత్త రెనాల్ట్ డస్టర్‌ను కొనుగోలు చేసే ముందు మొదట ఈ SUV ధరను తెలుసుకోవాలి. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.49 లక్షలు కాగా, ఈ SUV టాప్ వేరియంట్ ధర రూ. 18.49 లక్షల వరకు ఉంటుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే ఈ కారు ఆన్-రోడ్ ధర వివిధ నగరాల్లో మారవచ్చు.

Read Also : Credit UPI Payments : చిన్న UPI పేమెంట్లకు క్రెడిట్ కార్డు వాడితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా? పడిపోతుందా? అసలు నిజం ఇదే!

మీరు ఢిల్లీలో కొత్త రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం రూ. 1.16 లక్షలు, ఇన్సూరెన్స్ కోసం సుమారుగా రూ. 45,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర చిన్న చిన్న ఛార్జీలను కూడా కలిపితే రెనాల్ట్ డస్టర్ మొత్తం రూ. 12.22 లక్షల ఆన్-రోడ్ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.

రెనాల్ట్ డస్టర్ మినిమం డౌన్ పేమెంట్ :
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే కనీసం రూ. 3 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు నుంచి రూ. 9.22 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది.

రెనాల్ట్ డస్టర్ నెలవారీ ఈఎంఐ ఎంతంటే? :
బ్యాంకు నుంచి 5 ఏళ్ల కాలపరిమితికి 9శాతం వడ్డీ రేటుతో రూ. 9.22 లక్షల రుణం తీసుకుంటే.. మీరు నెలకు రూ. 19,139 ఈఎంఐగా చెల్లిస్తారు. అంటే.. రూ. 2,26,352 వడ్డీతో సహా 5 ఏళ్లలో మొత్తం రూ. 11,48,352 చెల్లిస్తారు.