Specialized Levo 4 X : వావ్.. కొండలు ఎక్కే ఎలక్ట్రిక్ మాన్‌స్టర్‌.. ఈ లెవో 4X బైక్ ధర వింటే గుండె జారిపోతుంది!

Specialized Levo 4 X : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి 840Wh బ్యాటరీ, 4.4 గంటల రైడింగ్ టైమ్‌తో స్పెషలైజ్డ్ లెవో 4X మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. ఈ బైకు ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

New Specialized Levo 4 X

  • స్పెషలైజ్డ్ లెవో 4ఎక్స్ 850W మోటారుతో అమర్చారు
  • సింగిల్ ఛార్జ్‌తో 4.4 గంటల పాటు ప్రయాణించగలదు
  • ఫీచర్లలో 2.2-అంగుళాల డిస్‌ప్లే, 12-ఆంప్ స్మార్ట్ ఛార్జర్‌

Specialized Levo 4 X : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? సైకిల్ మాదిరిగా కనిపించే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. స్పెషలైజ్డ్ అనే కంపెనీ ఈ కొత్త లెవో 4 ఎక్స్‌ మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ లెవో 4 ఎక్స్ అనేది కంపెనీ కొత్త హై-పెర్ఫార్మెన్స్ బైక్ అని చెప్పొచ్చు.

ఇందులో 840Wh బ్యాటరీ ఉంది. 111Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4.4 గంటల రైడింగ్ (Specialized Levo 4 X) టైమ్ అందిస్తుంది. లెవో 4 ఫుల్-సస్పెన్షన్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ ఎలక్ట్రికల్ బైకు 11m కార్బన్ ఫ్రేమ్‌తో వస్తుంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈవీ బైకు ధర ఎంతంటే? :
స్పెషలైజ్డ్ లెవో 4 ఎక్స్ బైకు ధర 11,999.99 డాలర్లు (సుమారుగా రూ. 11,41,000) ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఎలక్ట్రిక్ బైకును కొనుగోలు చేయవచ్చు. కంపెనీ లిస్టు ప్రకారం.. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. కంపెనీ ఫైరీ రెడ్ అనే సింగిల్ కలర్ వేరియంట్‌లో లాంచ్ చేసింది.

స్పెషలైజ్డ్ లెవో 4 ఎక్స్ బైక్ ఫీచర్లు :
స్పెషలైజ్డ్ లెవో 4X ఎలక్ట్రిక్ బైకు 111Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 850Wh మోటార్‌తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 4.4 గంటల పాటు రైడింగ్ టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ను అడ్జెస్టబుల్ చేసేలా కంపెనీ రూపొందించింది. ఇందులో 22 కిలోల వరకు బరువును మోసేందుకు ఫ్రంట్, బ్యాక్ కార్గో కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

Read Also : Vehicle Green Tax : అసలు గ్రీన్ టాక్స్ ఏంటి..? ఎవరికి వర్తిస్తుంది..? మీ వాహనంపై ఎప్పుడు విధిస్తారో తెలుసా..? కంప్లీట్ గైడ్

కంపెనీ ఫుల్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ బైక్ కాగా బరువు 27.2 కేజీలు ఉంటుంది. కంపెనీ హై పర్ఫార్మెన్స్ S-వర్క్స్ 3.1 మిడ్ మోటార్ డ్రైవ్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం.. సింగిల్ ఛార్జ్‌పై 4.4 గంటల పాటు రన్ అవుతుంది. అయితే, రైడింగ్ టైమ్ భూభాగం, అసిస్టెన్స్ లెవల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఫ్రంట్ సైడ్ 160 మిమీ ఫాక్స్ 38 ఫ్యాక్టరీ ఫోర్క్, బ్యాక్ సైడ్ 150 మిమీ ఫాక్స్ ఫ్లోట్ ఎక్స్ ఫ్యాక్టరీ రియర్ షాక్ ఉన్నాయి. స్పెషల్ జీనీ షాక్ టెక్నాలజీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 220 మిమీ ఓవర్‌సైజ్డ్ ఫోర్-పిస్టన్ బ్రేకులు ఉన్నాయి. బ్యాక్ సైడ్ 220 మిమీ రోటర్లు అమర్చి ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే.. 2.2-అంగుళాల డిస్‌ప్లే ఉంది. కంపానియన్ యాప్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. మల్టీ ఛార్జింగ్ మోడ్‌లతో 12-ఆంప్ స్మార్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.