Vehicle Green Tax : అసలు గ్రీన్ టాక్స్ ఏంటి..? ఎవరికి వర్తిస్తుంది..? మీ వాహనంపై ఎప్పుడు విధిస్తారో తెలుసా..? కంప్లీట్ గైడ్
Vehicle Green Tax : గ్రీన్ టాక్స్ అనేది పాత వాహనాలపై విధించే ప్రత్యేక పన్ను. కాలుష్యాన్ని తగ్గించడం, కొత్త, పర్యావరణ అనుకూలమైన వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యం. సాధారణంగా 15 ఏళ్లకు పైబడిన వాహనాలకు ఈ టాక్స్ వర్తిస్తుంది.
Vehicle Green Tax ( Image Credit : AI )
- కాలంచెల్లిన వాహనాలపై విధించే పన్నే గ్రీన్ టాక్స్
- మీ వాహనానికి గ్రీన్ టాక్స్ వర్తిస్తుందా? లేదా?
- పర్యావరణాన్ని పరిరక్షించడమే ఈ టాక్స్ ఉద్దేశం
Vehicle Green Tax : మీ ఇంట్లో పాత కారు, బైక్ లేదా కమర్షియల్ వెహికల్ ఉందా? అయితే, ఇది మీకోసమే.. మీరు ఎప్పుడైనా గ్రీన్ టాక్స్ గురించి విన్నారా? లేదంటే ఇప్పుడు తెలుసుకోండి. చాలా మంది ఇది కేవలం అదనపు పన్ను అనుకుంటారు. కానీ, అలా కాదు.. పర్యావరణాన్ని పరిరక్షించడమే ఈ టాక్స్ ఉద్దేశం.
భారత్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను (Vehicle Green Tax) అమల్లోకి తీసుకువస్తోంది. అలాంటి నిబంధనలలో ఒకటే గ్రీన్ ట్యాక్స్. కొత్త వాహనాల కన్నా ఎక్కువ పొగ, హానికరమైన వాయువులను విడుదల చేసే పాత వాహనాలపై ఈ పన్నును ప్రత్యేకంగా విధిస్తారు.
గ్రీన్ టాక్స్ ఏంటి? :
గ్రీన్ ట్యాక్స్ అనేది పాత వాహనాలపై విధించే ప్రత్యేక రుసుము.. కొత్త వాహనాలు, తక్కువ పొలుష్యన్ ఉండే వాహనాలకు మారేలా ప్రజలను ప్రోత్సహించడమే ఈ టాక్స్ ఉద్దేశం. ఒక వాహనం బాగా పాతబడితే దాని ఇంజిన్ మునుపటిలా క్లీన్, సమర్థవంతంగా పనిచేయదు. తద్వారా పొలుష్యన్ బాగా పెరుగుతుంది. రోడ్లపై ఇలాంటి వాహనాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించేందుకు పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్‌ను అమలు చేస్తోంది.
Read Also : POCO C85 5G : సూపర్ డిస్కౌంట్ మావా.. ఈ కొత్త పోకో 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
ఏ వాహనాలకు ఈ రూల్ వర్తిస్తుంది? :
సాధారణంగా 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా వాడిన కమర్షియల్ వాహనాలకు గ్రీన్ టాక్స్ వర్తిస్తుంది. చాలా రాష్ట్రాలలో పాత ప్రైవేట్ వాహనాలకు కూడా వర్తిస్తుంది. అయితే, నియమాలు అనేవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
ఓనర్లు తమ వాహనం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదా రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేస్తే గ్రీన్ టాక్స్ చెల్లించాల్సి రావచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వాహన నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ గ్రీన్ టాక్స్ ఎందుకంటే? :
పాత వాహనాలకు సైలెన్సర్ నుంచి ఎక్కువ పొగ వస్తుంటుంది. దాంతో గాలి క్వాలిటీని కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ అనుకూల వాహనాలను వినియోగించాలే ప్రోత్సహించడమే గ్రీన్ టాక్స్ లక్ష్యంగా చెప్పవచ్చు.
వెహికల్ ఓనర్లు ఏం చేయాలి? :
మీ వెహికల్ పాతదైతే ఫిట్నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్, లోకల్ నిబంధనలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోండి. మీ డాక్యుమెంట్లను కూడా సకాలంలో రెన్యువల్ చేసుకోండి. మీ వాహనానికి గ్రీన్ ట్యాక్స్ వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోండి. వాహనానికి సంబంధించి పూర్తి ఉంటే మీకు ఎలాంటి పెనాల్టీలు లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉండవు.
