New Tata Tigor Facelift : కొత్త లుక్‌తో టాటా టిగోర్.. 10.25 ఇంచుల స్క్రీన్‌తో అదిరే అప్‌డేట్.. ఫుల్ ఛార్జ్ చేస్తే 315 కి.మీ రేంజ్!

New Tata Tigor Facelift 2026 : అతి త్వరలో కొత్త టాటా కారు మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త డిజైన్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ క్యాబిన్‌తో వస్తోంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలివే..

New Tata Tigor Facelift 2026

  • బడ్జెట్‌లో కొత్త సెడాన్ కోసం చూస్తున్నారా?
  • టాటా టిగోర్ కొత్త అవతారం.. డిజైన్ నుంచి ఫీచర్ల వరకు
  • 10.25 ఇంచుల స్క్రీన్‌తో అదిరే అప్‌డేట్!

New Tata Tigor Facelift 2026 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? టాటా మోటార్స్ కాంపాక్ట్ సెడాన్ కొనాలని చూస్తున్నారా? టాటా టిగోర్ అతి త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది. కొత్త టాటా టిగోర్ ఫేస్ లిఫ్ట్ 2026 పేరుతో కొత్త మోడల్‌ను టాటా మోటార్స్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా కొత్త డిజైన్, భారీ టచ్‌స్క్రీన్‌తో కారును మరింత మోడ్రాన్‌గా మార్చేశారు.

కొత్త టిగోర్ ఫ్రంట్ సైడ్ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్‌లో మార్పులు ఉండొచ్చని అంచనా. సన్నగా ఉండే హెడ్‌ల్యాంప్స్, కొత్త బ్లాక్ ఎలిమెంట్స్‌తో కారు ఫ్రంట్ సైడ్ మరింత స్పోర్టీగా కనిపించనుంది. బ్యాక్ సైడ్ కూడా కొత్త టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ బంపర్ రావచ్చు. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త టిగోర్ లుక్‌లో అద్భుతంగా కనిపిస్తోంది.

Read Also : Oppo Find X10 Series : ఒప్పో నుంచి దుమ్మురేపే ఫోన్లు.. కెమెరా, బ్యాటరీ చూస్తే వావ్ అనాల్సిందే!

10.25 ఇంచుల స్క్రీన్ :
క్యాబిన్‌లోనే భారీ అప్‌డేట్ ఉండే అవకాశం ఉంది. కొత్త డ్యాష్‌బోర్డ్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించవచ్చని సమాచారం. దీంతో తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కోరుకునేవారికి టిగోర్ మరింత ఆకర్షణీయంగా మారనుంది.

ఇంజిన్‌లో భారీ మార్పుల్లేవు :
పెట్రోల్ టిగోర్‌లో ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కొనసాగవచ్చని తెలుస్తోంది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రావచ్చు. ఇక టిగోర్ కూడా కొత్త డిజైన్‌తో అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 26kWh బ్యాటరీ, సుమారు 315 కి.మీ రేంజ్ కొనసాగవచ్చని అంచనా. కొత్త టిగోర్ ధర, లాంచ్ తేదీపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈఎంఐలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ మోడల్‌ బెటర్ ఆప్షన్.