New Tvs Jupiter 125 Scooter Launched In India At Rs 73,400
New TVS Jupiter 125 scooter : ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్ ప్రవేశపెట్టింది. New TV Jupiter మోడల్ లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత్ లోని హోండా యాక్టివా 125cc, సుజుకీ యాక్సెస్ 125ccకి పోటీగా ఈ కొత్త టీవీఎస్ జుపిటర్ 125cc మోడల్ తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ 73,400గా నిర్ణయించింది.
Amazon GIF : అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. తెలంగాణలో 31వేల మంది వ్యాపారులకు బెనిఫిట్
న్యూ స్టయిలింగ్, న్యూ ప్లాట్ ఫాం, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాకుండా న్యూ స్టైలింగ్, న్యూ ప్లాట్‌ఫాం, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్, మెరుగైన రైడ్ క్వాలిటీతో కస్టమర్లతో ఆకట్టుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కస్టమర్ల అభిరుచికి తగినట్టుగా టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.
ఈ స్కూటర్ ప్రోగ్రెసివ్ నియో-మాస్క్యలైన్ స్టైలింగ్, LED, హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ ఫ్రంట్ లైట్ ఫీచర్లతో వచ్చింది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ స్కూటర్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. న్యూ టీవీఎస్ జూపిటర్ 125 డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్ వేరియంట్లతో డాన్ ఆరెంజ్, ఇండిబ్లూ, ప్రిస్టిన్ వైట్, టైటానియం, గ్రే కలర్ స్కీమ్స్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Evaru Meelo Koteeswarulu : తారక్ షో లో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి..