Nissan Magnite Facelift : కొత్త కారు కొంటున్నారా? నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. భారత్‌‌లో లాంచ్ ఎప్పుడంటే?

Nissan Magnite Facelift Launch : కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6.50 లక్షల నుంచి రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఈ కారులో మొత్తం 2 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 

Nissan Magnite facelift launch in India on October 4

Nissan Magnite Facelift Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. వచ్చే నెలలో నిస్సాన్ మోటార్ ఇండియా నుంచి సరికొత్త కారు రాబోతోంది. ఇప్పటికే, కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కంపెనీ దాదాపు 4 ఏళ్ల తర్వాత అక్టోబర్ 4న మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ కొత్త మోడల్ కారును లాంచ్ చేయనుంది. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కారులో అనేక ఎక్స్‌టీరియర్, ఇంటర్నల్ అప్‌డేట్స్ కలిగి ఉండగా, అవుట్‌గోయింగ్ మోడల్స్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కొనసాగుతుంది. ఈ కారులో మొత్తం రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

బీ4డీ 1.0-లీటర్ సహజంగా-ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72పీఎస్, 96ఎన్ఎమ్), హెచ్ఆర్ఏఓ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ (100పీఎస్, 160ఎన్ఎమ్/152ఎన్ఎమ్). బీ4డీ 1.0-లీటర్ యూనిట్ 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఆప్షన్లను కలిగి ఉంటుంది. అయితే, హెచ్ఆర్ఏఓ 1.0-లీటర్ యూనిట్ 5-స్పీడ్ ఎంటీ, సీవీటీ ఆప్షన్లను పొందుతుంది.

ప్రస్తుతం, నిస్సాన్ మాగ్నైట్ మోడల్ ధర రూ. 6 లక్షలతో ప్రారంభమై రూ. 11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6.50 లక్షల నుంచి రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ సిట్రోయెన్ బసాల్ట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్‌లకు పోటీగా మార్కెట్లోకి రానుంది.

Read Also : Amazon Festival 2024 Sale : త్వరలో అమెజాన్‌‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు.. బెనిఫిట్స్ పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు