Nissan X-Trail Launch : కొత్త కారు కొంటున్నారా? నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కారు ఇదిగో.. 7 సీటర్ అవతార్, ధర ఎంతంటే?

Nissan X-Trail Launch : ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏకైక జపనీస్ సీబీయూ ఎస్‌యూవీగా ఉంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్ వేరియబుల్ కంప్రెషన్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

Nissan X-Trail launched in India at Rs 49.92 lakh

Nissan X-Trail Launch : నిస్సాన్ మోటార్ ఇండియా దేశంలో ఎక్స్-ట్రైల్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ధర రూ. 49.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వెహికల్ జపనీస్-మేడ్ కంప్లీట్ బిల్ట్-అప్ (CBU) మోడల్‌గా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌కు పోటీగా టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ ఉన్నాయి.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఒక గ్లోబల్ కారు. ప్రస్తుతం 150 మార్కెట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇప్పటివరకూ, ప్రపంచవ్యాప్తంగా 7.8 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో టాప్ 5 గ్లోబల్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచిందని జపనీస్ కార్ల తయారీ సంస్థ పేర్కొంది.

Read Also : Nissan Magnite Discount Offer : రూ. 6 లక్షల విలువైన SUVపై రూ. 62 వేల తగ్గింపు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి..!

ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏకైక జపనీస్ సీబీయూ ఎస్‌యూవీగా ఉంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్ వేరియబుల్ కంప్రెషన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 1.5-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ యూనిట్ గరిష్టంగా 163పీఎస్ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎస్‌యూవీ సరికొత్త, థర్డ్-జెన్ ఎక్స్‌ట్రానిక్ సీవీటీని కలిగి ఉంది. ఇందులో డీ-స్టెప్ లాజిక్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్‌లు ఉన్నాయి. 12వి ఎఎల్‌ఐఎస్ (ALiS) (అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్) తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. మెరుగైన ఇంధన వ్యవస్థను కలిగి ఉంది.

నిస్సాన్ ఎక్స్-టైల్ స్పెషిఫికేషన్లు :
అలయన్స్ (రెనాల్ట్-నిస్సాన్) సీఎమ్ఎఫ్-సి ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 7-సీటర్ అవతార్‌లో భారత్‌కు వస్తుంది. ఫ్లోటింగ్ రూఫ్, వి-మోషన్ గ్రిల్‌తో కూడిన సిగ్నేచర్ నిస్సాన్ డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. హెడ్‌లైట్లు, డీఆర్ఎల్, టెయిల్‌లైట్‌లు ఎల్ఈడీ యూనిట్‌లతో పాటు బ్యాక్ సైడ్ స్ప్లిట్ లైట్లు ఉన్నాయి. ఎస్‌యూవీ 20-అంగుళాల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. పెరల్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ అనే మూడు ఎక్స్‌ట్రనల్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

ఎక్స్-ట్రైల్ క్యాబిన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే (వైర్‌లెస్), 12.3-అంగుళాల టీఎఫ్టీ మల్టీ-ఇన్ఫర్మేషన్ స్క్రీన్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోతో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లకు అనుకూలమైన 8-అంగుళాల నిస్సాన్‌కనెక్ట్ డిస్‌ప్లే స్క్రీన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. హోల్డ్, వైర్‌లెస్ ఛార్జర్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరాను కూడా పొందుతుంది. భారత్‌లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మూడు సంవత్సరాల/లక్ష కి.మీ వారంటీతో పాటు మూడు ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో అందిస్తోంది. రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉత్పత్తిపై ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంటుంది.

Read Also : Bajaj Freedom 125 Launch : బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ చూశారా? ఆగస్టు 15నాటికి 77 సిటీల్లో అందుబాటులోకి..!

ట్రెండింగ్ వార్తలు